గురువారం 06 ఆగస్టు 2020
Devotional - Jul 23, 2020 , 23:41:02

జూలై 25న గరుడ పంచమి

  జూలై 25న గరుడ పంచమి

తిరుమల: తిరుమ‌ల‌లో జూలై 25వ తేదీ శ‌ని‌వారంనాడు గరుడ పంచమి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకొని శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయ‌కుల మండ‌పంలో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడ వాహ‌నాన్ని అధిరోహించ‌నున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా శ్రీ‌వారి ఆల‌యంలో గ‌రుడ పంచ‌మిని ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు. ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.


logo