మంగళవారం 11 ఆగస్టు 2020
Devotional - Jul 24, 2020 , 14:59:57

రేపు తిరుమలలో గరుడ పంచమి వేడుకలు

రేపు తిరుమలలో గరుడ పంచమి వేడుకలు

తిరుమల: గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో గరుడ పంచమి వేడుకలను నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయంలోని రంగనాయకులు మండపంలో సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి ఇష్టవాహనమైన గరుడ వాహనాన్ని అధిరోహిస్తారని చెప్పారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలో భాగంగా శ్రీవారి ఆలయంలో గరుడ పంచమిని ఏకాంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.  కాగా గురువారం స్వామివారిని 4,834 మంది భక్తులు దర్శించుకున్నారు. 1467 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు వేసిన కానుకల ద్వారా రూ.43లక్షల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo