గురువారం 24 సెప్టెంబర్ 2020
Devotional - Aug 30, 2020 , 23:36:35

పూర్ణాహుతితో ముగిసిన ప‌విత్రోత్స‌వాలు

పూర్ణాహుతితో ముగిసిన ప‌విత్రోత్స‌వాలు

తిరుప‌తి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో ఆదివారం రాత్రి పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, చందనంతో అభిషేకం నిర్వహించారు.కాగా రాత్రి యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, ప్ర‌బంధ శాత్తుమొర‌, వేద శాత్తుమొర నిర్వ‌హించారు. అనంత‌రం ఉత్స‌వ‌మూర్తులు కుంభం విమాన‌ప్ర‌ద‌క్షిణంగా స‌న్నిధికి వేంచేపు చేశారు.


logo