మంగళవారం 11 ఆగస్టు 2020
Devotional - Jul 07, 2020 , 22:10:44

తిరుమల ట్రై ఓజోన్‌ స్ర్పేయింగ్‌ సిస్టమ్‌

 తిరుమల ట్రై ఓజోన్‌ స్ర్పేయింగ్‌ సిస్టమ్‌

తిరుమల: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తిరుమల,తిరుపతి దేవస్థానంలో టీటీడీ అధికారులు ట్రై ఓజోన్‌ స్ర్పేయింగ్‌ సిస్టమ్‌ను మంగళవారం నెలకొల్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వ్యాధి కారక క్రిముల నుంచి ఎలాంటి హాని కలుగకుండా నిర్మూలించేందుకు గాను స్వామివారి ఆలయంలోనికి ప్రవేశించే రెండు మార్గాల్లో వీటిని ఏర్పాటు చేశారు.       

శ్రీవారి ఆలయ మహాద్వారం ముందు భక్తులు ప్రవేశించే స్కానింగ్‌ సెంటర్‌ వద్ద, విధి నిర్వహణలో ఉన్న అర్చకులు, , ఉద్యోగులు ప్రవేశించే బయోమెట్రిక్‌ వద్ద ట్రైఓజోన్‌ పొగమంచు రూపంలో స్ప్రేయింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో హైడ్రాక్సిల్‌ ఫ్రీ ర్యాడికల్‌ ఐయాన్‌ స్ర్ర్పేయింగ్‌ చేయడం వల్ల వ్యాధికారక సూక్ష్మక్రిములు నశిస్తాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో భక్తులు, ఉద్యోగులు, అర్చకులు అనారోగ్య కారక క్రిముల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు.

టీటీడీ ఇప్పటికే కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు విస్తృత చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అలిపిరి వద్ద భక్తులకు, ఉద్యోగులకు థర్మల్‌ స్కానింగ్‌, కరోనా పరీక్షలకు శాంపుల్స్‌ తీసుకుంటున్నారు. టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో నిర్ణీత సమయంలో క్యూలైన్లు, ఆలయంలోని అన్ని ఉపరితలాల్లో సేంద్రియ సూక్ష్మ క్రిమి నిర్మూలన కారకాలతో నిరంతరం శుభ్రం చేస్తున్నామని వివరించారు.


logo