గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Jul 30, 2020 , 19:52:56

తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి ఇ-హుండీ సౌక‌ర్యం

 తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి ఇ-హుండీ సౌక‌ర్యం

తిరుప‌తి‌ : తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం త‌ర‌హాలో తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి ఇ-హుండీ సౌక‌ర్యాన్ని టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. నేరుగా ద‌ర్శ‌నానికి రాలేని భ‌క్తులు ఇ-హుండీ ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మ‌వారికి కానుకలు స‌మ‌ర్పించ‌వ‌చ్చు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారాగానీ, గోవింద మొబైల్ యాప్ ద్వారా గానీ భ‌క్తులు కానుక‌లు చెల్లించ‌వ‌చ్చు. వెబ్‌సైట్‌, యాప్‌లో ఇదివ‌ర‌కే న‌మోదు చేసుకున్న భ‌క్తుల‌తో పాటు ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదు చేసుకోనివారు కూడా ఈ సౌక‌ర్యాన్ని వినియోగించుకోవ‌చ్చు. పేరు, ఇ-మెయిల్‌, మొబైల్ నంబరు, చిరునామా త‌దిత‌ర వివ‌రాలు పొందుప‌రిచి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు‌తో కానుక‌ల‌ను స‌మ‌ర్పించవ‌చ్చు.‌


logo