శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jul 31, 2020 , 09:00:21

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఇ-హుండీ సౌకర్యం

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఇ-హుండీ సౌకర్యం

తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఇ-హుండీ సౌకర్యాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దర్శనానికి రాలేని భక్తులు  ఇ-హుండీ ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మవారికి కానుకలు సమర్పించవచ్చని సూచించింది. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారాగానీ, గోవింద మొబైల్‌ యాప్‌ ద్వారా గానీ భక్తులు కానుకలు చెల్లించవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు. వెబ్‌సైట్‌, యాప్‌లో ఇదివరకే నమోదు చేసుకున్న భక్తులతో పాటు ఇప్పటివరకు నమోదు చేసుకోని వారు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. పేరు, ఇ-మెయిల్‌, మొబైల్‌ నంబరు,చిరునామా తదితర వివరాలు పొందుపరిచి డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డుతో కానుకలను సమర్పించవచ్చని సూచించింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo