గురువారం 22 అక్టోబర్ 2020
Devotional - Sep 18, 2020 , 09:35:49

ఇంద్రకీలాద్రిపై పూజల్లో భక్తులకు అనుమతి

ఇంద్రకీలాద్రిపై పూజల్లో భక్తులకు అనుమతి

అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శుక్రవారం పూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సేవల్లో భక్తులు పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పల్లకీ సేవ, పంచ హారతులు, దర్బార్‌ సేవలో భక్తులను అనుమతించాలని దుర్గ గుడి అధికారులు నిర్ణయించారు. నేటి నుంచి ఆన్‌లైన్‌లో పూజలకు సంబంధించిన టికెట్లను సైతం విడుదల చేయనున్నారు. అలాగే కృష్ణానది మాతకు నదీ హారతి ఇచ్చేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. నేటి సాయంత్రం 6.30 గంటలకు దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు హారతి పట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా మహమ్మారి సంక్రమణ క్రమంలో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఇస్తున్నారు. సుమారు ఆరు నెలల తర్వాత కృష్ణా నది హారతి కార్యక్రమం ప్రారంభం అవుతోంది. కృష్ణా జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 38,325 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం 4,901 యాక్టివ్‌ కేసులు ఉండగా, 33,097 మంది కోలుకున్నారు. 327 మంది మహమ్మారి కారణంగా మృత్యువాతపడ్డారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo