గురువారం 22 అక్టోబర్ 2020
Devotional - Sep 24, 2020 , 11:07:24

వచ్చేనెల 17నుంచి దేవీ న‌వరాత్రి ఉత్స‌వాలు

వచ్చేనెల 17నుంచి దేవీ న‌వరాత్రి ఉత్స‌వాలు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌ముఖ దేవాల‌యం విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ శ‌ర‌న్న‌వ‌‌రాత్రి ఉత్స‌వాలు వ‌చ్చేనెల 17న ప్రారంభంకానున్నాయి. ద‌ర‌సా నేప‌థ్యంలో ఏటా నిర్వ‌హించే న‌వ‌రాత్రి ఉత్స‌వాలు అక్టోబ‌ర్ 17 నుంచి 25 వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని దేవ‌స్థానం సీఈఓ వెల్ల‌డించారు. 

కరోనా దృష్ట్యా రోజుకి 10,000 మంది భక్తులకు మాత్రమే దర్శనం క‌ల్పిస్తామ‌ని చెప్పారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామ‌‌న్నారు. అలాగే మూలా నక్షత్రం రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు దుర్గమ్మ దర్శనం కల్పిస్తామ‌న్నారు.  

ప్రత్యేక కుంకుమార్చన, చండీ హోమం, శ్రీ చక్ర నవ‌వర్ణార్చన పూజల‌కు భ‌క్తుల‌కు అనుమ‌తిలేద‌ని వెల్ల‌డించారు. ద‌ర్శ‌నం టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే విక్ర‌యిస్తామ‌న్నారు.  కరోనా నేప‌థ్యంలో అమ్మవారి దర్శనంకోసం వచ్చే భక్తులు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధరించాల‌ని సూచించారు. 


logo