శనివారం 05 డిసెంబర్ 2020
Devotional - Oct 26, 2020 , 09:47:37

నేడు భ‌ద్రాచ‌లంలో ద‌స‌రా ఉత్స‌వాలు

నేడు భ‌ద్రాచ‌లంలో ద‌స‌రా ఉత్స‌వాలు

హైద‌రాబాద్‌: భ‌ద్రాచ‌లం శ్రీసీతారామ‌చంద్ర‌స్వామి ఆల‌యంలో విజ‌య‌ద‌శ‌మి వేడుక‌లు ఇవాళ జ‌ర‌గ‌నున్నాయి. వైష్ణ‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం వేడుక‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని ఆల‌య అధికారులు తెలిపారు. ద‌స‌రా ఉత్స‌వాల్లో భాగంగా స్వామివారికి ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వం నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. సాయంత్రం ద‌స‌రా మండ‌పంలో శ‌మీపూజ‌, ఆయ‌ధ పూజ జ‌రుగ‌నున్నాయి. అదేవిధంగా రావ‌ణ వ‌ధ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.