ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jul 09, 2020 , 09:53:01

టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా

టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా

తిరుపతి: తిరుమల,తిరుపతి దేవస్థానంలో భక్తుల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు.  ఇప్పటివరకు 200 మంది టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అన్నారు. వీరిలో 80మంది కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని వివరించారు. పాజిటివ్‌ వచ్చిన సిబ్బంది అందరినీ హోం క్వారంటైన్‌, ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్సలు అందించామని వెల్లడించారు.  భక్తుల ఆరోగ్యమే ధ్యేయంగా టీటీడీ అనేక చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు 800 మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు పలుచోట్ల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. అలిపిరి వద్ద, శ్రీవారి ప్రధానద్వారం వద్ద స్ర్పేయింగ్‌ మిషన్లను ఏర్పాటు చేశామన్నారు. 


logo