శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jun 20, 2020 , 13:33:17

21న అప్పన్న స్వామి ఆలయం మూసివేత

21న అప్పన్న స్వామి ఆలయం మూసివేత

విశాఖపట్నం: సూర్యగ్రహణం సందర్భంగా  జిల్లాలో ప్రసిద్ధిగాంచిన సింహాద్రి అప్పన్న స్వామి ఆలయాన్ని ఆదివారం మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.ఉదయం 10.21 గంటలకు సూర్యగ్రహణం  ప్రారంభమై మధ్నాహ్నం 1.49 గంటలకు వీడుతుందని వివరించారు.

మధ్యాహ్నం 3 గంటల  తరువాత ఆలయంలో సుప్రభాతం, ప్రాత:కాల ఆరాధనతో ప్రారంభించి గ్రహణ సంప్రోక్షణ, బాలభోగం, రాజభోగం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆదివారం స్వామి వారి దర్శనాలు ఉండవని తెలిపారు. 22న ఉదయం 7గంటల నుంచి దర్శనాలు పున:ప్రారంభమవుతాయని ఈవో ఒక ప్రకటనలో తెలిపారు.  

తాజావార్తలు


logo