గురువారం 06 ఆగస్టు 2020
Devotional - Jun 15, 2020 , 06:56:39

21న టీటీడీ ఆలయం మూసివేత

21న టీటీడీ ఆలయం మూసివేత

తిరుమల: ఈనెల 21న సూర్యగ్రహణం సందర్భంగా 13 గంటల పాటు టీటీడీ ఆలయ  తలుపులు మూసివేస్తున్నామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

శనివారం రాత్రి ఒంటిగంటకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేసి ఆదివారం మధ్నాహ్నాం 2.30గంటలకు ఆలయ శుద్ధి అనంతరం  తెరుస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం జూన్‌ 30 వరకు  రోజుకు మూడు వేల చొప్పున ఆన్‌లైన్‌ ద్వారా  టికెట్లు జారీ చేశామని,  ఆన్‌లైన్‌ టికెట్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలి,  సర్వదర్శనం కోసం తిరుపతిలోని కౌంటర్ల ద్వారా ప్రతిరోజూ  మూడువేలు చొప్పున ఈ నెల 22 వరకు ఇస్తున్నాం అని వివరించారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలు,దర్శన టికెట్లు బుక్‌ చేసుకున్న వారు రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించామని ఆయన వెల్లడించారు. 


logo