e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home చింతన పానీపే ఫత్వా

పానీపే ఫత్వా

పానీపే ఫత్వా

నీళ్లు నాయినా! నీళ్లు.. నీళ్లవి
దూపార్పుకోవడానికి
తుకం పోసి నారు పెట్టుకోవడానికి
పశువులు తాగడానికి
పెయికడుకోవడానికి బతుకడానికి
తడిలేని బతకులెన్నాళ్లు నాయినా!

నదికీ నమస్కరించినం
పూజించి పుష్కరాలు జరిపినం గానీ..
నీళ్లను బొక్కలుగొట్టి దోచుకోలేదు దాచుకోలేదు
కన్నీళ్లను తాగి బతికీనోళ్లం నాయినా!

- Advertisement -

పరిష్కారానికి పెద్ద మనిషివే గానీ
ఆక్రమణదారుడిలా నదులను ప్రాజెక్టులను
నీ కాలుకు కట్టేసుకుంటవా ఏంది
నీళ్లు ఎక్కువైతే అరుగవు నాయినా..
నదులు బుట్టిలో పండుకొనే కోడిపెట్టలు కాదు
అమ్మపాల రొమ్ములు నాయినా!

రాష్టాల హక్కుల్ని
అధికారాలను పంటికింద నలిపేస్తున్నవు
స్వేచ్ఛను అస్తిత్వాలను హరిస్తున్నవు
నడిచే నడకలను కట్టేబట్టల్ని
మాట్లాడే మాటల్ని నిషేధిస్తున్నవు
ఏ దేవుడి ఆదర్శమురా నాయినా!
ఏం పోయేకాలంరా నాయినా!!

తెలంగాణ తల్లిని
మళ్లీ మళ్లీ బానిసను చేయడానికి
గద్దలు, గండుపిల్లులు మోపైతున్నవి
నిన్నటి దుర్మార్గాలనే నిలబెట్టడానికీ
ఊరును గేరిని ఊడ్చెయ్యడానికీ
ప్రత్యామ్నాయాలు బోనాలెత్తుతున్నవి
నీళ్లు కల్మషంలేనివి
మర్మంలేని అధికారయావల్ని ఎంతైనా కప్పుకోండి
తల్లికి గంజిపోసే గిన్నెను కాలుతో తన్నకండి!

పానీ పే ఫత్వా నహీ చలేగా
ఏ అవామ్‌ కా ధోఖా హోగా
హిసాబ్‌ చుక్తా హోనా హీ పడేగా!

వనపట్ల సుబ్బయ్య
94927 65358

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పానీపే ఫత్వా
పానీపే ఫత్వా
పానీపే ఫత్వా

ట్రెండింగ్‌

Advertisement