పురా కవీనాం గణనాప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః
అద్యాపి తత్తుల్య కవేర భావాత్ అనామికా సార్ధవతీ బభూవ!
సంస్కృత భాషలో మన ఉంగరము వేలుకు ‘అనామిక’ అని పేరు. అనగా పేరులేనిది. అలా ఎందుకు ఉండిపోయిందంటే.. పూర్వ కాలంలో ప్రసిద్ధ కవులను లెక్కించే సందర్భంలో కాళిదాసు గారికి ప్రథమస్థానం ఇచ్చి ఒకటి అని చిటికెన వేలితో లెక్క మొదలుపెట్టి అంతటి మరొక కవి ఊహకు అందకపోవుట చేత ఉంగరము వేలు అనామికగానే మిగిలిపోయిందట. కాళిదాసు అంతటి కవి మరొకరు లేరని అర్థం.
–టి.సుధాకరశర్మ