సోమవారం 01 జూన్ 2020
Devotional - May 08, 2020 , 19:01:22

ప్రారంభ‌మైన జ‌గ‌న్నాత ర‌థ‌యాత్ర ర‌థాల నిర్మాణం ప‌నులు

ప్రారంభ‌మైన జ‌గ‌న్నాత ర‌థ‌యాత్ర ర‌థాల నిర్మాణం ప‌నులు

భువ‌నేశ్వ‌ర్‌:  పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌కు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. జ‌గ‌న్నాథుని ర‌థాల నిర్మాణం ప‌నులు ఈ రోజు ప్రారంభించిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ర‌థ‌ఖాలా( సాంప్ర‌దాయ ఆల‌య వ‌ర్క్‌షాప్‌) వ‌ద్ద నిర్మాణం ప‌నులు జ‌రుగుతున్నాయి. ర‌థాల నిర్మాణ ప్రాంగ‌ణంలో పూర్తిగా బారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల మేర‌కు మాస్క్‌లు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తున్న‌ట్లు మ‌హారాణ‌( వ‌డ్రంగి), భోయ్‌( సేవ‌కుడు) తెలిపారు. ఈ రోజు ర‌థాల చ‌క్రాల‌ను త‌యారు చేయ‌డానికి లాగ్ల‌ను క‌త్తిరించిన‌ట్లు తెలిపారు. 

ర‌థాల నిర్మాణంలో ప‌నిచేసే 150 మందికి ఆరోగ్య ప‌రీక్ష‌లు చేశామ‌ని శ్రీ జ‌గ‌న్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేష‌న్ చీఫ్ ఆఫీస‌ర్ కృష్ణ‌కుమార్ తెలిపారు. ర‌థాల‌ను స‌కాలంలో పూర్తి చేయ‌డం, ప‌నులు చేసేవారి ఆరోగ్యాన్ని కోపాడుకోవ‌డం త‌మ ముందు ఉన్న రెండు ల‌క్ష్య‌ల‌ని పేర్కొన్నారు. రథాల నిర్మాణంలో పాల్గొనే సిబ్బంది అంద‌రికీ ప‌నులు పూర్త‌య్యే వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలోనే వ‌స‌తి, భోజ‌న సౌక‌ర్యం క‌ల్పిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ప‌నివారంద‌రూ ఇంటికి వెళ్ల‌డానికి వీలు లేద‌ని పేర్కొన్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల ర‌థాల నిర్మాణం ప‌నులు ఇప్ప‌టికే 10 రోజుల ఆల‌స్యంగా ప్రారంభ‌మ‌య్యాయి. 


logo