శనివారం 06 జూన్ 2020
Devotional - May 12, 2020 , 16:58:02

బుల్లెట్‌ దేవుడు... గుడి కట్టిన పోలీసులు..

బుల్లెట్‌ దేవుడు... గుడి కట్టిన పోలీసులు..

ఆ ఊరిలో బుల్లెట్‌కే గుడి కట్టేసి పూజలు చేస్తున్నారు జనాలు.. అవును రాజస్థాన్‌లోని పాలిలో బుల్లెట్‌కు మహిమలున్నాయని ఏకంగా దేవునిగా నమ్ముతూ పూజలు చేస్తున్నారు అక్కడ సమీప గ్రామాల ప్రజలు. ఇక గుడి కట్టింది ఎవరో కాదు సాక్షాత్తూ అక్కడ పోలీసులే ఆ గుడిని కట్టారట. సుమారు 1990 సంవత్సరం ప్రాంతంలో ఓం బన్నా అనే వ్యక్తి తన బుల్లెట్‌పై వెలుతూ స్రమాదవ శాత్తు ఓ చెట్టుకు గుద్దుకుని మరణించాడట. ప్రమాదం అనంతరం  అతను చెట్టు సమీపంలోనే మరణించగా ఆ బుల్లెట్‌ మాత్రం సమీపంలో ఉన్న గుంత వద్ద పడిపోయి ఉందట. 

అయితే పోలీసులు వచ్చి విచారణ నిమిత్తం బైకును తీసుకువెళ్ళి స్టేషన్‌లో ఉంచారట. కానీ తెల్లారేసరికి బండి స్టేషన్‌లో లేదట. తీరిగి ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్ళి చూస్తే బండి అక్కడే ఉందట. తిరిగి ఎన్ని సార్లు తెచ్చినా బండి మళ్ళి అక్కడికే వెలుతుందట. దీంతో విసుగు చెందిన పై అధికారి తానే రాత్రంతా బుల్లెట్‌కు కాపలాగా కూర్చున్నాడట. సరిగ్గా  రాత్రి ఒంటి గంట సమయంలో బుల్లెట్‌ లైట్లు వెలిగి  తిరిగి బుల్లెట్‌ను అదే ప్రాంతానికి చేర్చాలని ఓ గొంతు మాట్లాడిందట. దీంతో బయపడ్డ ఆ అధికారి ఉదయమే ఆ బుల్లెట్‌ను ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేర్చి సర్వ మర్యాదలతో గుడి కట్టించాడట.

అప్పటి నుండి ఆ సమీప గ్రామాల  ప్రాంతాల ప్రజలు ఎటు ప్రయాణం చేయాలన్నా ఆ బండి వద్దకు వెళ్ళి పూజ చేసి వెళుతున్నారు. అలా చేయకుండా వెళితే వారి ప్రయాణం ప్రమాదకరమని వారు భావిస్తారు. ఇలా బుల్లెట్‌ నిత్య పూజలు అందుకుంటూ దేవునిగా మారిపోయింది.logo