శనివారం 08 ఆగస్టు 2020
Devotional - Jul 15, 2020 , 19:44:01

టీటీడీ ఉద్యోగులకు బ్రాండెడ్‌ శానిటైజర్లు

టీటీడీ ఉద్యోగులకు బ్రాండెడ్‌ శానిటైజర్లు

తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానం పరిధిలోని స్థానిక ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బ్రాండెడ్ శానిటైజర్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నిర్వహించిన సమావేశంలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జిల్లా కలెక్టర్‌ భరత్‌ నారాయణ గుప్తా, అధికారులు పాల్గొన్నారు.

తిరుమలలో ఉద్యోగులకు చేస్తున్న కోవిడ్‌ పరీక్షలు, ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయించిన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే అంశాలపై సమావేశంలో చర్చించారు. విష్ణు నివాసాన్ని కోవిడ్‌ నివారణ కేంద్రంగా నిర్ణయించినందున విష్ణు నివాసంలో ఉన్న సర్వదర్శనం టైంస్లాట్‌ కౌంటర్లను మూసివేసి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో కౌంటర్ల సంఖ్యను పెంచి భక్తులకు టోకెన్లు కేటాయిస్తున్నారు. స‌మావేశంలో టీటీడీ అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు  పి.బ‌సంత్‌కుమార్‌,  భార్గ‌వి, స్విమ్స్ సంచాల‌కులు వెంగ‌మ్మ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ చంద్ర‌మౌళి తదితరులు పాల్గొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo