శనివారం 19 సెప్టెంబర్ 2020
Devotional - Aug 22, 2020 , 16:29:50

కాణిపాకంలో బ్రహోత్మవ్సాలు షురూ..

కాణిపాకంలో బ్రహోత్మవ్సాలు షురూ..

అమరావతి : ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో చవితి వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితితో మొదలై వచ్చే నెల 11వ తేదీ వరకు 21  రోజుల పాటు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా భక్తులు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు స్వామివారికి పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. గ్రామోత్సవంను సేవలను నిలిపివేసి, ఆలయ ప్రాకారంలోని వాహన సేవలు నిర్వహించనున్నారు. వినాయక చవితి రోజు మూడు వేల నుంచి నాలుగు వేల మందికి మాత్రం దర్శన భాగ్యం కలుగనుంది. 60 ఏళ్లుపైబడిన, పదేళ్ల లోపు చిన్నారులకు దర్శనానికి అనుమతి లేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జితసేవలను రద్దు చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo