శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Mar 09, 2020 , 11:56:38

నేటినుంచి భద్రాద్రి రామయ్య కళ్యాణ వేడుకలు..

నేటినుంచి భద్రాద్రి రామయ్య కళ్యాణ వేడుకలు..

భద్రాద్రి కొత్తగూడెం: నేటి నుంచి భద్రాద్రి రామయ్య కళ్యాణ వేడుక పనులు అంగరంగ వైభవంగా  ప్రారంభమవనున్నాయి. ఆలయంలోని చిత్రకూట మండపంలో తలంబ్రాలు కలిపే కార్యక్రమంతో కళ్యాణ పనులు ఆరంభమవుతాయి. 150 క్వింటాళ్ల బియ్యంతో 100 కిలోల ముత్యాలు కలిపి తలంబ్రాలు తయారు చేస్తారు. తలంబ్రాల తయారీకి ఆలయ అధికారులు, పూజారులు 150 క్వింటాళ్ల బియ్యం, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలను సిద్దం చేశారు. భక్తులు రోలు, రోకలికి పూజలు నిర్వహించి, పసుపుకొమ్ములను దంచనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భక్తులు సామూహికంగా.. పసుపు, కుంకుమలను కలపనున్నారు. స్వామివారు చిత్రకూట మండపంలో పెళ్లికొడుకులా దర్శనమిస్తారు. ఇవాళ ఆలయ పూజారులు సీతారాములకు స్నపన తిరుమంజనం, వసంతోత్సవం, డోలోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. 

తాజావార్తలు


logo