శనివారం 08 ఆగస్టు 2020
Devotional - Jul 17, 2020 , 07:14:06

శ్రీవారికి బ్యాటరీ ద్విచక్ర వాహనం విరాళం

శ్రీవారికి బ్యాటరీ ద్విచక్ర వాహనం విరాళం

తిరుమల: తిరుపతికి చెందిన టీవీఎస్‌ ఏజెన్సీస్‌ నిర్వాహకులు టీటీడీ ఆలయానికి ఐక్యూ బ్యాటరీ ద్విచక్రవాహనాన్ని విరాళంగా అందజేశారు. దాదాపు రూ.1.4లక్షల విలువైన ఈ ద్విచక్రవాహనా తాళాలను టీటీడీ  చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, దాతలు భక్తవత్సల నాయుడు, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్రవాహనాన్ని తిరుమల శ్రీవారి సేవాసదన్‌-1 కార్యాలయ  అవసరాల కోసం అందించినట్లు దాతలు పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo