శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jun 21, 2020 , 07:26:11

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు

అమరావతి: ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిలో  సోమవారం నుంచి జూలై 20 వరకు ఆషాఢ  మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో సురేష్‌బాబు తెలిపారు. ఉత్సవాల తొలిరోజు సోమవారం దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు, చైర్మన్‌ పైలా సోమినాయుడు తదితరులు అమ్మవారికి సారెను సమర్పిస్తారని ఆయన వెల్లడించారు.

భక్తులు కూడా అమ్మవారికి సారె సమర్పించేందుకు దేవస్థానం అవకాశం కల్పించిందన్నారు. భక్తులు ప్రతి రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల లోగా ఆన్‌లైన్‌ ద్వారా టైం స్లాట్‌ను బుక్‌ చేసుకుని  ఒకేసారి కాకుండా భౌతిక దూరం పాటిస్తూ ఆలయానికి చేరుకోవాలని ఈవో సురేష్‌బాబు సూచించారు. 


logo