బుధవారం 21 అక్టోబర్ 2020
Devotional - Oct 04, 2020 , 09:02:58

ప్రారంభ‌మైన ల‌క్ష్మీనార‌సింహుని ఆర్జిత సేవ‌లు

ప్రారంభ‌మైన ల‌క్ష్మీనార‌సింహుని ఆర్జిత సేవ‌లు

యాదాద్రి: యాదాద్రీశుని ఆర్జిత సేవ‌లు మ‌ళ్లీ ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా నిబంధ‌న‌ల‌తో పూజ‌ల నిర్వ‌హ‌ణకు అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. ఆర్జిత‌పూజ‌ల‌తోపాటు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు, స‌త్యనారాయ‌ణస్వామి వ్ర‌తాలు కూడా నిర్వ‌హిస్తున్నారు.  అయితే ప‌రిమిత సంఖ్య‌లో టికెట్లు జారీచేస్తున్నారు. అభిషేకాలు, అర్చ‌న‌లు, క‌ల్యాణాలు పున‌రుద్ధ‌ర‌ణ‌, సుద‌ర్శ‌న నార‌సింహ హోమం, జోడు సేవ‌లు, సువ‌ర్ణ పుష్పార్చ‌న పున‌రుద్ధ‌రించారు. భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించి, భౌతిక‌ దూరం పాటించాల‌ని ఆల‌య ఈవో గీత తెలిపారు. 

  • స్వామివారి నిజాభిషేకం: 25 టికెట్లు మాత్ర‌మే జారీచేస్తారు. టికెట్‌పై ఇద్ద‌రికి మాత్ర‌మే ప్ర‌వేశం క‌ల్పిస్తారు. 
  • స్వామివారి స‌హ‌స్ర‌నామార్చ‌న‌: 25 టికెట్లు, ఒక‌రికి మాత్ర‌మే అనుమ‌తి
  • సుద‌ర్శ‌న నార‌సింహ హోమం: 25 టికెట్లు, 50 మందికి ప్ర‌వేశం
  • నిత్య క‌ల్యాణోత్సం: 25 టికెట్లు, 50 మందికి అనుమ‌తి
  • మొక్కు జోడు సేవ‌లు: 25 టికెట్లు ఇస్తారు. టికెట్‌పై ఇద్ద‌రికి ప్ర‌వేశం క‌ల్పిస్తారు. 
  • స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు:  ప్ర‌తిరోజు నాలుగుసార్లు నిర్వ‌హిస్తారు. ప్ర‌తి బ్యాచ్‌కు 50 టికెట్లు ఇస్తారు. మొత్తం వంద మందికి ప్ర‌వేశం క‌ల్పించారు. 
  • త‌ల‌నీలాలు స‌ర్పించే క‌ల్యాణ‌క‌ట్ట ఉద‌యం 5 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంది. 


logo