శనివారం 31 అక్టోబర్ 2020
Devotional - Oct 05, 2020 , 20:45:03

రాజన్న భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఈ నెల7 నుంచి ఆర్జిత సేవలు

రాజన్న భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఈ నెల7 నుంచి ఆర్జిత సేవలు

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ నుంచి భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు. అన్‌లాక్‌లో భాగంగా కేంద్రం ఇచ్చిన సడలింపులతో భక్తులకు ప్రస్తుతం దర్శనం మాత్రమే కల్పిస్తుండగా.. ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఈ నెల 7 నుంచి పలు సేవల్లో భక్తులకు పాల్గొనేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. రాజన్నకు ప్రీతికరమైన కోడె మొక్కుతో పాటు సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు. అభిషేకాలు, అన్నపూజ, కుంకుమపూజలకు అనుమతి నిరాకరించారు. భీమేశ్వరస్వామి, బద్దిపోచమ్మ ఆలయంలో అభిషేకాలు, బోనాల సమర్పణ కొనసాగించవచ్చని చెప్పారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.