శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Jul 02, 2020 , 10:25:46

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్‌

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్‌

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం‌ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. నాలుగురోజుల పర్యటనలో భాగంగా బుధవారం తిరుమలకు చేరుకున్న స్పీకర్‌కు స్థానిక శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద జిల్లా అధికారులు, టీటీడీ డిప్యూటీ ఈవో బాలాజీ స్వాగతం పలికారు. గురువారం స్పీకర్‌ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా   ఆలయ అర్చకులు, అధికారులు స్పీకర్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.  అనంతరం   కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి, శ్రీనివాస మంగాపురం ఆలయాన్ని దర్శించుకోనున్నారు. రాత్రి తిరుమలకు వచ్చి బస చేస్తారని అధికారులు తెలిపారు. శుక్రవారం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని, శనివారం శ్రీకాళహస్తీశ్వరస్వామిని స్పీకర్‌ దర్శించుకోనున్నారు

తాజావార్తలు


logo