మంగళవారం 20 అక్టోబర్ 2020
Devotional - Sep 24, 2020 , 08:24:05

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, కర్ణాటక సీఎంలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, కర్ణాటక సీఎంలు

తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో సీఎంలను అర్చకులు వేదామంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం అక్కడి నుంచి నాదనీరాజం వేదికపై జరుగుతున్న సుందరకాండ పారాయంలో పాల్గొన్నారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మిస్తున్న రూ.200 కోట్లతో వసతి గృహాల సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న కర్ణాటక సీఎంకు జగన్‌, టీటీడీ అధికారులు స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. ఇదిలా ఉండగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9.30గంటలకు హనుమంత వాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo