సోమవారం 03 ఆగస్టు 2020
Devotional - Jun 26, 2020 , 11:20:57

టీటీడీ సర్వదర్శనానికి 3,750 టోకెన్లు జారీ

టీటీడీ సర్వదర్శనానికి 3,750 టోకెన్లు జారీ

తిరుపతి: తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు టీటీడీ అధికారులు శుక్రవారం సర్వదర్శనం టోకెన్లు జారీ చేశారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో జారీ చేసిన టోకెన్లు పూర్తి కావడంతో అదనంగా  ప్రతి రోజూ 3,750మందికి  ఉచితంగా సర్వదర్శనం కల్పించేందుకు తిరుపతిలోని  మూడు కేంద్రాలను ప్రారంభించింది.

ఈ కేంద్రాల్లో 18కౌంటర్ల ద్వారా టోకెన్ల జారీని ప్రారంభించింది. తిరుపతిలోని విష్ణు నివాసంలో 8 కౌంటర్లు, శ్రీనివాసంలో 6 కౌంటర్లు, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో 4 కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. 


logo