ఎవరు భగవంతుని సన్నిహితులు?

‘సమో హం సర్వ భూతేషు నమే ద్వేష్యో స్తిన ప్రియః
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్'
- శ్రీ కృష్ణుడు (భగవద్గీత: 9.29)
‘నేను అందరిపట్లా సమానభావం కలిగి ఉంటాను, ఎవరినీ ద్వేషించను. ఎవరైతే నన్ను భక్తితో సేవిస్తారో, ప్రేమతో ఆరాధిస్తారో వారు నాకు సన్నిహితులు. నేను వారిలో ఉంటాను, వారు నాలో ఉంటారు. అటువంటి భక్తులను ప్రత్యేకంగా సంరక్షిస్తాను’. దేవుడు అందరికీ సమానమే అయినా, తనను శరణు పొందిన భక్తులపై ఎక్కువ శ్రద్ధ చూపుతాడనడానికి ఇదే నిదర్శనం. ఈ అభిమానవాదం ఆయన దోషం కాదు, ఆభరణం!
‘మీ తల్లిదండ్రులు, తోబుట్టువులను ఎక్కువగా ప్రేమించి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మీకేమనిస్తుంది? మీ ప్రొఫెసర్ మీ క్లాస్మేట్ పట్ల పక్షపాతంతో ఉంటే మీరు తట్టుకోగలరా? పెద్దల నుంచి నిష్పక్షపాతమైన ప్రేమను ఆశించడం అందరికీ సహజమే కాక ధర్మం కూడా. వారి ఆదరణలోని వ్యత్యాసం ఎవరినైనా నిరుత్సాహానికి, నిరాశకు గురిచేస్తుంది. మరి, సకల జీవరాశులకు తండ్రి, శ్రేయోభిలాషి భగవంతుడే కొందరు బిడ్డల పట్ల పక్షపాతం చూపితే..?’ ఇలా ప్రశ్నించేవారు ఎందరో ఉన్నారు. ‘భగవంతుడు అందరికీ సమానమైతే కొంతమంది పేదలుగా, మరి కొంతమంది ధనికులుగా ఎందుకు జన్మిస్తారు? కొందరు అందంగా, ఇంకొందరు కురూపులుగా ఎందుకున్నారు?’. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే స్వయంగా ‘భగవద్గీత’లో పేర్కొన్నాడు, ‘నేను భక్తులను రక్షించటానికి, దుష్టులను శిక్షించడానికి ప్రతి యుగంలో వేర్వేరు రూపాల్లో అవతరిస్తాను’ అని. భగవంతుడికి అందరూ సమానమైతే, ‘ఆయన తన భక్తులను రక్షిస్తూ, రాక్షసులనే ఎందుకు శిక్షించాలి? వరాహ రూపం దాల్చి హిరణ్యాక్షుడిని, నరసింహావతారంలో హిరణ్య కశిపుడిని వధించాడు. వామనుడిగా బలి మహారాజు దర్పాన్ని అణచివేశాడు. దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికినా, ఆయన మోహిని రూపం దాల్చి అమృతాన్నంతా దేవతలకే ఇచ్చాడు. మారువేషంలో అమృతాన్ని తాగడానికి ప్రయత్నించిన రాహువు శిరస్సును తన సుదర్శన చక్రంతో ఖండించాడు. దీనివల్లే ఆయనను ‘సుర పక్షపాతి’ అన్నారు. శ్రీ కృష్ణుడిని ఎందరో ‘పాండవ పక్షపాతి’ అనీ అన్నారు.
లోతుగా వీక్షించినవారికి ఈ ‘దైవ అసమానతల’కు కారణం బోధపడుతుంది. అందరూ భగవంతుడి బిడ్డలే అయినా వారంతా తనను పూజించడం లేదు. ఆయన్ను పూజించే ప్రతివారూ ‘శుద్ధభక్తులు’ కావడం లేదు. కొందరు భౌతిక కోర్కెలతో ఆయన్ని పూజిస్తుంటే, మరికొందరు నిస్వార్థంగా ఆయనకు సేవ చేస్తుంటారు. భగవంతుడు వారి వారి భావాలకు అనుగుణంగానే ప్రతిస్పందిస్తాడు (‘యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్..’: భగవద్గీత, 4.11). అందుకే ఇలాంటి వేర్వేరు ఫలితాలను చూస్తున్నాం. మనుషుల అందం, సంపద, తెలివి, పేదరికం, కష్టాలు అన్నీ వారి స్వయంకృత కర్మల ఫలితాలే. అది భగవంతుడి అసమానతా కాదు, పక్షపాతమూ కాదు. ఇలాంటి విమర్శ భగవంతుని పట్ల అపరాధమే అవుతుంది. ఒకసారి ఒక తేనెటీగ తేనెకోసం అన్వేషిస్తూ ఒక అందమైన తామర పువ్వు మీద వాలింది. దానిలోని తేనెను ఆస్వాదిస్తూ కాలం మరిచిపోయింది. సాయంత్రం సమీపిస్తున్న కొద్దీ, సూర్యుడు అస్తమించటం మొదలుపెట్టాడు. తామర రేకులు నెమ్మదిగా మూసుకున్నాయి. ఈ విషయాన్ని గ్రహించలేని తేనెటీగ పువ్వు లోపల చిక్కుకొని కొద్దిసేపట్లోనే మరణించింది. ఈ తేనెటీగ మరణానికి కారణమెవరు? సూర్యుడా? తామర పువ్వా? ఆదిత్యుని దినచర్య అది. ఉషోదయం చీకటిని నాశనం చేసి కొందరికి ఆనందాన్నిస్తే దొంగలు, గుడ్లగూబల వంటి జీవులకు బాధను కలిగిస్తుంది.
గౌరంగ దర్శన్ దాస్
99307 58996
తాజావార్తలు
- అత్తారింట్లో భార్యను ఎవరు కొట్టినా భర్తదే బాధ్యత: సుప్రీంకోర్టు
- ఆటో ఇండస్ట్రీ ‘రైట్‌సైజింగ్’: ఆదా కోసం ఉద్యోగాలపై వేటు!
- డిజిటల్ బడ్జెట్ : అందరికీ ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్
- చిరు సాంగ్‌కు చిందేసిన మోనాల్.. వీడియో వైరల్
- కొవిడ్ టీకా తీసుకున్న డీఎంకే అధ్యక్షుడు
- అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు.. పీపీఈ కిట్‌లో అనుమానితుడు
- రోదసీలో అడుగిడిన యూరి గగారిన్ జయంతి.. చరిత్రలో ఈరోజు
- తన కుక్కల్ని వైట్‌హౌజ్ నుంచి పంపించేసిన బైడెన్
- రాహుల్‌కే పార్టీ పగ్గాలు : యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం!
- కొండగట్టు అంజన్న భక్తుల కొంగు బంగారం : ఎమ్మెల్సీ కవిత