శనివారం 05 డిసెంబర్ 2020
Devotional - Oct 24, 2020 , 00:37:10

మంగళప్రదాయిని మహాగౌరి

మంగళప్రదాయిని మహాగౌరి

ధ్యానం: శ్వేతవృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః

మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవీ ప్రమోదదా॥

ఆదిపరాశక్తి భయంకరమైన కాళి స్వరూపాన్ని విసర్జించి ఆకృతిదాల్చిన చల్లని రూపం మహాగౌరి. ధవళకాంతితో వెలిగిపోయే వృషభంపై స్వచ్ఛమైన తెల్లని ఛాయతో మంగళ స్వరూపిణిగా మహాగౌరి అవతరించింది. ధన, వైభవ శక్తులకు ఈ తల్లి అధిదేవత. భక్తుల అభీష్టాలను నెరవేర్చి సకల సంతోషాలను అనుగ్రహిస్తుంది. మంగళకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. గౌరీదేవి దర్శనంతో మనసులో కల్మషం తొలగిపోయి నిర్మలమైన భావన కలుగుతుంది. మహాగౌరిని ఆరాధించిన వారికి సమస్త పాపాలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలూ సిద్ధిస్తాయి.

నైవేద్యం: అశ్వీయుజ శుద్ధ అష్టమి రోజు మహాగౌరీదేవిగా అమ్మవారిని అలంకరించి శ్రీసూక్తంతో స్తుతించి చక్కెర పొంగలి, బెల్లం పాయసం నైవేద్యంగా పెడతారు. రకరకాల మధుర పదార్థాలు నివేదనగా సమర్పిస్తారు.