శుక్రవారం 04 డిసెంబర్ 2020
Devotional - Oct 22, 2020 , 23:30:38

ఉగ్రరూపిణి కాళరాత్రి

ఉగ్రరూపిణి కాళరాత్రి

ధ్యానం: ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా

లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ॥

వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా

వర్ధనమూర్ధజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ॥

ప్రపంచానికి వాటిల్లిన ఉపద్రవం నుంచి మానవాళిని ఉద్ధరించడానికి అవతరించిన దేవిగా కాళరాత్రిని భావిస్తారు. నల్లని రంగులో అభయహస్తంతో గార్ధభ (గాడిద) వాహనంపై లోకభీకర రూపంలో సాక్షాత్కరించింది కాళరాత్రీదేవి. ఆమె వాహనం కూడా కాలమేఘంలా దర్శనమిస్తుంది. నలుపు రంగులో శోభిల్లే ఈ కాళరాత్రి అవతారాన్ని ఆరాధిస్తే చెడు తొలిగి సకల శుభాలూ వర్షిస్తాయి. ఆకలితో అల్లాడే దీనులకు శాకంబరిగా శాకపాకాల్ని అనుగ్రహించే చల్లని తల్లి.. ధర్మ పరిరక్షణ కోసం భయంకర రూపంలో దుష్టశిక్షణ చేస్తుంది.

నైవేద్యం: ఆశ్వీయుజ శుద్ధ సప్తమి నాడు కాళరాత్రి అవతారంగా దేవిని ఆరాధించి, శాకంబరిగా కీర్తించి శాకాన్నం సమర్పిస్తారు. పలు రకాలైన కాయగూరలతో చేసిన కిచిడి నైవేద్యంగా పెడుతారు.


తాజావార్తలు