శనివారం 05 డిసెంబర్ 2020
Devotional - Oct 21, 2020 , 00:23:19

విశ్వజనని స్కందమాత

విశ్వజనని స్కందమాత

ధ్యానం:సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥

నైవేద్యం:ఆశ్వీయుజ శుద్ధ పంచమి రోజు స్కందమాతగా జగజ్జననిని పూజించి, లలితా సహస్రనామ పారాయణంతో స్తుతిస్తారు. దధ్యోదనం (పెరుగన్నం) నివేదనగా సమర్పిస్తారు.

ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవి. ఆ దేవత అమ్మగా కనిపించే అద్భుతమైన రూపం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి. ఆయనకు తల్లి కాబట్టి పార్వతీదేవి స్కందమాత అయింది. ఈ రూపంలో శ్వేతవర్ణంలో కుమారస్వామిని లాలిస్తూ దర్శనమిస్తుంది. తన బిడ్డలందరిపై అమృతాన్ని కురిపిస్తూ అభయం ప్రసాదిస్తుంది. అమ్మ భావనలోనే అమృతత్తం ఉన్నది. ‘యాదేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా’ అంటున్నది దేవీస్తుతి. ప్రతి మాతృమూర్తిలోనూ జగన్మాతను దర్శించాలనే సందేశాన్ని మానవాళికి ప్రబోధిస్తుంది స్కందమాత. అమ్మగా ఆమె చూపించే కరుణ శాశ్వత చైతన్యఝరి. సకల సృష్టిపై వాత్సల్యపూరిత దృష్టిని ప్రసరించే విశ్వజననిని మనసారా కొలుద్దాం.