శుక్రవారం 30 అక్టోబర్ 2020
Devotional - Oct 18, 2020 , 00:23:13

పట్టుదలకు సంకేతం బ్రహ్మచారిణి

పట్టుదలకు సంకేతం బ్రహ్మచారిణి

బ్రహ్మచారిణి.. శక్తికి ఆకృతియైన ఈ దేవి నిత్యతపో ముద్రాంకిత. పరమేశ్వరుని భర్తగా కోరి తపస్సు చేసి, తపః ఫలాన్ని పొందింది. పట్టుదలకూ, కృషికీ సంకేతం ఈ అవతారం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పోరాడి ఫలితాన్ని పొందాలనే భావన బ్రహ్మచారిణి అవతారంలో కనిపిస్తుంది. ఈ రూపంలోని దేవిని ఆరాధించిన వారికి ఏకాగ్రత, పట్టుదల అలవడతాయని శ్రుతి వచనం.

ధ్యానం : దధానాకర పద్మాభ్యా కుక్షమాలా కమండలం

           దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యముత్తమా

నైవేద్యం: ఆశ్వీయుజ శుద్ధ విదియ రోజు బ్రహ్మచారిణీ అవతారంలో మహాశక్తిని ఆరాధిస్తూ, అమ్మవారికి ప్రీతిపాత్రమైన పసుపు రంగులో చేసిన చిత్రాన్నం లేదా పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు.