గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Aug 02, 2020 , 23:32:54

గాయత్రి ప్రాయశ్చిత్త జపం!

గాయత్రి ప్రాయశ్చిత్త జపం!

శ్రావణ పూర్ణిమ మరుసటి రోజు శ్రావణ బహుళ పాడ్యమి (4వ తేది, మంగళ వారం)ని ‘గాయత్రి పాడ్యమి’గా జరుపుకొంటాం. దీనిని ‘గాయత్రి ప్రతిపద’గానూ పిలుస్తాం. యజ్ఞోపవీతధారులు తెలిసో తెలియకో దొర్లిన దోషాల నుండి ఉపశమం కోసం ‘ప్రాయశ్చిత్తం’గా గాయత్రి జపం చేయడాన్ని ఈ రోజు సంప్రదాయంగా పాటిస్తున్నాం. ఆపస్తంభ ధర్మసూత్రం ప్రకారం ఋగ్వేద, యజుర్వేద, సామ వేదులందరూ ఆనాడు ‘సహస్ర గాయత్రి జపం’ చేయాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి నిత్యానుష్ఠానాలను పూర్తి చేసి ‘మిథ్యాదీతదోష ప్రాయశ్చిత్తార్థం సహస్ర గాయత్రీ మంత్రజపం కరిష్యే’ అని సంకల్పించి, వెయ్యిసార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే సరి. ‘ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వత మూర్థనీ, బ్రాహ్మణేభ్యో అభ్యనుజ్ఞాతా గచ్చదేవి యథాసుఖమ్‌' అని ఉపస్తాన మంత్రంతో అమ్మవారిని సాగనంపి కేశవనామాలతో ముగించాలి. ఈ సంవత్సరంలో ‘కొవిడ్‌-19’ కారణంగా ఎవరి ఇంటివద్ద వారు ఈ జపం చేయడం ద్వారా మహమ్మారి వ్యాధిని ఎదుర్కొనే శక్తిని అందరం పొందుదాం.

వినోద్‌ కుమార్‌ మహావాది , 90000 13755


logo