శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jul 26, 2020 , 23:02:44

భూప్రాప్తికి.. శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమ:

భూప్రాప్తికి..  శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమ:

‘యజ్ఞ వరాహస్వామి’ని నిరంతరం ప్రార్థిస్తే భూప్రాప్తి చేకూరుతుంది.

 ‘శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమ:’ అనే మంత్రోపాసన ఇందుకు ఎంతో గొప్పగా ఉపకరిస్తుంది.

పంచభూతాలలో మనకు ఆధార భూతమైంది భూమి మాత్రమే. మనం నివసించడానికి, మనకు అవసరమైన పంటలు పండించుకొని జీవిక కొనసాగించడానికి కూడా భూమి మాత్రమే ఆధారం. మన పుట్టుక, చివరికి మన కలయిక కూడా ఈ భూమిపైనే. మనం నివసించే ఈ భూగ్రహం మీద మూడింట రెండువంతులు నీరు ఉంది. మిగిలిన భూ భాగంలోనూ పర్వతాలు, అడవులు, గనులు ఎన్నో ఉన్నాయి. నివసించడానికి, సాగు చేసుకోవడానికి, వినియోగించుకునే మైదాన నేల చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి భూప్రదేశం గొప్పదనాన్ని తెలుసుకొని బతికినన్నాళ్లు మన వినియోగానికి దానిని సంపాదించుకునే అవసరం రోజురోజుకూ పెరుగుతున్నది. అందుకే, భూమాత ప్రార్థనకు అందరం కట్టుబడాలి.

పురాణాల ప్రకారం ఈ భూమిని ఉద్ధరించింది ‘శ్రీయజ్ఞ వరాహ’ అవతారం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఈ భూమిని జలంలో మొత్తం ముంచి వేసే ప్రయత్నం చేసినపుడు, భూదేవి ప్రార్థనవల్ల, శ్రీమహావిష్ణువు యజ్ఞ వరాహ రూపంలో వచ్చి తన కొమ్ముతో భూమిని పైకి లేపడం మనకు తెలుసు. ఈ కథనం వెనుక భూమి ఆవిర్భావ విజ్ఞానమూ ఉంది. భూమాతను ప్రార్థించే వేళ ఆ వరాహస్వామి ఆరాధన తప్పనిసరి. ‘యజ్ఞ వరాహస్వామి’ని నిరంతరం ప్రార్థిస్తే భూప్రాప్తి చేకూరుతుంది. ‘శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమ:’ అనే మంత్రోపాసన ఇందుకు ఎంతో గొప్పగా ఉపకరిస్తుంది.

ఏ జపమైనా కేవలం 11 సార్లు లేదా 21 సార్లు లేదా 108 సార్లు చేయడం మాత్రమే కాదు. మన అవసరం ఎంత తీవ్రమైతే అంత అధికంగా చేయాలి. ఆకలినిబట్టి ఆహారం తీసుకున్నట్లుగా అవసరాన్నిబట్టి జపం ఉండాలి. ఉపాసన మన మనసులో నిరంతరం కొనసాగుతుండాలి. కూర్చుని కనీసం రోజుకు 2 గంటలు చేసిన తర్వాత మన పనుల్లో ఉంటూకూడా మనసులో జపిస్తూ ఉండవచ్చు. ఇంతటి నిష్ఠతోనే మంత్రసిద్ధి కలుగుతుంది. ప్రత్యేక నియమాలు ఏమీ పాటించనవసరం లేదు. భగవంతుని నామంతో ఎంత ఎక్కువగా సన్నిహితంగా ఉంటామో అంత త్వరగా ఫలప్రాప్తి కలుగుతుంది. 


logo