గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Jul 13, 2020 , 23:38:04

క్రియాయోగంతో మనోశక్తి

క్రియాయోగంతో మనోశక్తి

ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి పనికివచ్చే శక్తిమంతమైన విధానం ‘క్రియాయోగం’. దానికి క్రమశిక్షణ, జీవితంలోని ప్రతి విషయం పట్ల ఒక ఖచ్చితత్వం కావలసి ఉంటాయి. చాలామందికి క్రియాయోగానికి కావలసిన శారీరక, మానసిక, మనోభావనాపరమైన నిలకడలు ఉండవు. అందరూ బాల్యం నుండీ చాలా సుఖంగా జీవించటానికి అలవాటు పడ్డారు. ‘సుఖం’ అంటే భౌతికపరమైన సుఖం కాదు. సుఖంగా కుర్చీ మీద కూర్చోవడం సాధనకు అడ్డంకి కాదు. కానీ, మీ జీవితకాల క్రియాయోగంతో మనోశక్తి ఐనా, సాధకుల విశ్వాసం సడలరాదు. ‘ఏదో కారణం వుంది’ అనుకోవాలి. ఇంతటి స్థిరత్వానికి వచ్చాక వారిని క్రియాయోగంలోకి ప్రవేశపెట్టవచ్చు. వారి మనోభావాలు, దృక్పథాలు సరియైనవిగా లేనప్పుడు అతనికి ఒక విధమైన శక్తిని కలుగజేస్తే అతను తనకు తానే ఎంతో హాని చేసుకుంటాడు. ఇలా నిరీక్షంపజేశాకే సాధకులకు క్రియాయోగం అందించడం ఈ ఆధునిక ప్రపంచంలో చాలా అరుదుగానే జరుగుతుంది.

‘జ్ఞానాన్ని పొందటం మాత్రమే కాక అంతకు మించి ఏదో సాధించాలని అనుకున్నప్పుడే’ క్రియాయోగం సాధ్యమవుతుంది. ఏదో ఒకలాగా ఈ పంజరం నుండి తప్పించుకొని పోవాలనుకునే సాధకులకు కావలసింది కేవలం ముక్తి, జ్ఞానం. వారికి క్రియాయోగంతో పనిలేదు. ఎందుకంటే, అది చాలా విస్తృతమైంది. దానికి ఎంతో క్రమశిక్షణ అవసరం. ముక్తి కావాలంటే క్రియలను కొద్ది మాత్రంగా ఉపయోగించుకోవచ్చు. వాటిపై అంతగా దృష్టి నిలుపనవసరం లేదు. అందుకు క్రియను మాత్రమే మార్గంగా ఎంచుకోనక్కరలేదు. దానికి ఎంతో కృషిచేయవలసి ఉంటుంది. గురువు లేకుండా క్రియాయోగ మార్గాన్ని అనుసరించాలని అనుకొనే సాధకులు పరిణతి చెందటానికి కొన్ని జన్మలు పడుతుంది. మంచి గురువు ప్రత్యక్షంగా తోడున్నప్పుడు అది ఈ జన్మలో జరగవచ్చు. క్రియా యోగంతో జ్ఞానాన్నేకాక జీవన సాంకేతికతను కూడా తెలుసుకోవచ్చు.

క్రియాయోగ మార్గంలో పైకి వచ్చినవారి ఉనికి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే, వారి శక్తులపై వారికి పూర్తి పట్టు లభిస్తుంది. వారు జీవితాన్ని విడదీసి, మళ్ళీ కూర్చగలరు. ఇతర మార్గాల్లో పయనించదలచుకుంటే ఉదాహరణకు జ్ఞానమార్గంలో ఉన్నారనుకోండి! సాధకులు పదును పెట్టిన కత్తిలా, బుద్ధితో ఎన్నో చేయగలుగుతారు. కానీ, వారి శక్తితో ఏమీ చెయ్యలేరు. భక్తిమార్గంలో ఉన్నా ఏమీ చెయ్యలేరు. వారు అసలు పట్టించుకోరు, ఎందుకంటే, కేవలం వారు అందులో లీనమై పోవాలనుకుంటారు. కర్మయోగంలో ఉన్నవారు ప్రపంచంలో ఎన్నో పనులు చేయగలరు. కానీ, వారితో వారు ఏమీ చేసుకోలేరు. క్రియాయోగులు మాత్రం మానసికశక్తితో తమను తాము ఏమైనా చేసుకోగలరు, ఈ ప్రపంచంతోనూ చెయ్యగలరు. ప్రేమాశీస్సులతో..


logo