మంగళవారం 14 జూలై 2020
Devotional - Jun 28, 2020 , 23:12:38

నమో నమామి..

నమో నమామి..

వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజ నాశ్రయించ వరదం వందే శివం శంకరం॥

- శివస్తోత్రం

సుమారు 5,000 ఏండ్ల చరిత్ర గలదిగా భావిస్తున్న జమ్ము కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహలో ఏడాదికొకసారి సహజ సిద్ధంగా ఏర్పడే మంచులింగ రూపంలోని పరమశివుని దర్శనార్థం నెలరోజుల పాటు సాగే భక్తియాత్రకు సమయం ఆసన్నమైంది.  కరోనా నేపథ్యం దీనికి పెద్ద అడ్డంకిగానే ఉన్నది. భారతీయులకు ప్రత్యేకించి వైదిక భక్తులకు ఈ యాత్ర ఒక అద్భుత అనుభవాన్నిస్తుంది. అంత దూరం వెళ్లలేని శివభక్తులు కనీసం ఈ గురుపూర్ణిమ వేళయినా ఆదిగురువు శివస్వామిని స్తుతించడం అత్యంత సముచితం.logo