ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jun 27, 2020 , 23:57:48

పుష్పయాగం ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?

  పుష్పయాగం ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం లో ప్రతి ఏటా పుష్పయాగం నిర్వహిస్తుంటారు. అయితే ఈ పుష్పయాగం నిర్వహించడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే...?  బ్ర‌హ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార, అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ ,తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆల‌యంలో మే 28 నుంచి జూన్ 5వ తేదీ వరకు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఏకాంతంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, పుష్ప‌యాగం నిర్వ‌హించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి చామంతి, సంపంగి, రోజా, మ‌ల్లెలు, లిల్లీ, మొల్ల‌లు, క‌న‌కాంబ‌రం, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలు, తుల‌సి, మ‌రువం, బిల్వం, ప‌న్నీరాకు వంటి పత్రాల‌తోపుష్పయాగం నిర్వహిస్తారు.  logo