శుక్రవారం 07 ఆగస్టు 2020
Devotional - Jun 22, 2020 , 01:50:18

‘వాలి వధ’.. ధర్మమేనా?

‘వాలి వధ’..  ధర్మమేనా?

ప్రశ్న: రాముడు వాలిని చెట్టు చాటునుండి చంపడం అధర్మం కాదా? -పార్నంది సాత్విక్‌శర్మ, బోడుప్పల్‌, హైదరాబాద్‌

సాధనా పర్వమైన జీవితంలో ధర్మం కన్నా ధర్మసూక్ష్మాలను తెలుసుకోవాలి. ఏ సమాజంలోనైనా తమ్ముడు బతికి ఉండగా అతణ్ని పారదోలి, కూతురిగా గౌరవించదగిన అతని భార్యను వశపరచుకోవడం కాముకత్వం, అధర్మం. దానికి మరణ దండనే సరైన శిక్ష. పీడితులను రక్షించడం, పీడించిన వానిని శిక్షించడం రాజ ధర్మమే. మృగాలు సంగమిస్తున్నప్పుడు తప్ప, వాటిని ఎలా వేటాడినా ధర్మమే. వాలి మృగం కాబట్టి, చెట్టు చాటునుండి చంపడం ధర్మమే. యుద్ధం చేస్తున్నప్పుడు పరిసరాలను పరిశీలించాలి, అప్రమత్తంగా ఉండాలి. రాముడు చాటునుంచయినా ధనుష్టాంకారం చేస్తూ ఎదురుగానే కొట్టాడు. ఆ చప్పుడు వినక పోవడం, నిర్లక్షంగా ఉండటం వాలి తప్పు. అందుకని, రాముడు చేసింది ధర్మమే. ఇకపోతే, ఈ సన్నివేశంలో రామునిలో ధర్మబద్ధమైన లక్ష్యం, సరైన వ్యూహం, ఆత్మవిశ్వాసం, దృఢ వైఖరి, నిర్భయత్వం, నిర్మోహత్వం మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

- పాలకుర్తి రామమూర్తి, 9441666943


logo