బుధవారం 05 ఆగస్టు 2020
Devotional - Jun 19, 2020 , 00:39:12

ప్రతీ ఇల్లాలు వీటిని ఖచ్చితంగా ఆచరించాలి

ప్రతీ ఇల్లాలు వీటిని ఖచ్చితంగా ఆచరించాలి

 హైదరాబాద్: ఇంట్లో వారి ఎదుగుదలకైనా..నాశనానికైనా ...  ఆ ఇంటి ఇల్లాలు తీరు ప్రభావం చూపుతుందని పూర్వీకులు చెబుతుంటారు. ఇంటి ఇల్లాలుచేయాల్సినవి, అలాగే చేయకూడని కొన్ని పనులు గురించి పండితులు ప్రస్తావించారు.. అవేంటంటే కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి, ఎందుకంటే పసుపు క్రిమినాశిని.స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు… సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు.

ఉప్పు, మిరప కాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చిన, చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచేపుడు కుడి చేతితో చేయాలి, ఎడమ చేతిని ఉపయోగించ కూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదు.స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్ప కూడదు, రేపు తీసుకుంటాను అని చెప్పాలి…ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటె శ్రాద్ధము ముగిసేవరకు ముగ్గు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేయాలి. ఇంటి ఇల్లాలి నోటినుండి ఎప్పుడు కూడా పీడ ,దరిద్రం, శని, పీనుగా, కష్టము, అనే పదములను వినిపించకూడదు.. ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూళ్లు దారిద్ర హేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 


logo