శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Jun 08, 2020 , 00:54:54

దమం - ఇంద్రియ నిగ్రహం

దమం - ఇంద్రియ నిగ్రహం

అరణ్యకాండలో సీతాదేవి ఒక కథ చెప్పింది. అడవిలో తపస్సు చేసుకుంటున్న ఒక మునిదగ్గరకు దేవేంద్రుడు సైనికుడి రూపంలో వెళ్లాడు. తన ఖడ్గాన్ని భద్రపరచమనీ, మళ్లీ వచ్చి తీసుకుంటాననీ చెప్పాడు. కాదనడానికి కారణం కనిపించలేదు మునికి. కానీ, ఆ ఆయుధం.. ముని ఆలోచనలను పక్కకి మళ్లించింది. కందమూల ఫలాలను తెచ్చుకోవడానికి  వెళ్ళినా కత్తి తీసుకునే వెళ్ళేవాడు. నిత్యం ఆయుధాన్ని ధరించడం వల్ల అతడి మనసు క్రూరంగా మారింది. క్రమంగా తన తాపస ప్రవృత్తిని వదులుకున్నాడు. ఆశ్రమ ఆవరణలో తిరిగే జింకల్ని సంహరించసాగాడు. చివరికి నరకానికి వెళ్లాడు. చెడ్డవాటితో సంపర్కం మనసును మలినం చేస్తుందని ఈ కథ ద్వారా  సీతామాత రాముడితో చెబుతుంది. 


logo