బుధవారం 08 జూలై 2020
Devotional - May 30, 2020 , 17:10:04

శని జయంతి రోజున చెయ్యాల్సినవి, చేయకూడనివి...

శని జయంతి రోజున చెయ్యాల్సినవి, చేయకూడనివి...

 హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. సాధారణంగా మనకు ఉన్న ఏడు రోజుల్లో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవ భగవానుడి కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం గా చెబుతారు. శని దేవుడిని ఆరాధించడం వల్ల వారి జీవితంలో విఘ్నాలు తొలగి ,విజయాలు అందుతాయని అనేక మంది భక్తులు నమ్ముతారు. సూర్యదేవుని కుమారుడైన శని పుట్టినరోజు సందర్భంగా శని జయంతిని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై శని తీవ్ర ప్రభావం చూపుతాడు. అంతేకాకుండా శని గ్రహానికి రాజు ఆయనే. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్మకం. అయితే ఈ శని జయంతి నాడు కొన్ని పనులను అస్సలు చేయకూడదట. అంతేకాదు మరికొన్నిపనులు కచ్చితంగా చేయాలంట. అలా చేస్తే భక్తులు కష్టాలు, సమస్యల నుండి విముక్తి పొందుతారట. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జ్యేష్ట మాస అమావాస్య రోజున ప్రతి సంవత్సరం శని జయంతిని జరుపుకుంటారు.