శనివారం 06 జూన్ 2020
Devotional - Apr 29, 2020 , 23:00:07

రామనామ రసికతే ఆంజనేయం

రామనామ రసికతే ఆంజనేయం

శ్రీరామనామ సంకీర్తనే హనుమంతుని భక్తికి, సద్గుణాలకు మకుటాయమానమైంది. హనుమన్నామ స్మరణే రామభక్తులకు అనన్యమైన చైతన్యాన్నిస్తుంది. మారుతి జీవిత విశేషకాలమంతా రామనామ సంకీర్తనకే అంకితమైంది. రోమరోమాలలో, హృదయం నిండా రామ నామామృత పానం చేసి కొలుస్తాడు కపివరుడు. కళ్ళ నుంచి భక్తి ఆనందం కనిపించే బాష్పాలుగా స్నిగ్ధ బిందువులు జలజల రాలి ప్రతిబింబాలుగా రామభక్తుల ముఖాల్లో ప్రజ్వరిల్లుతాయి.

‘హనూమత్సంహిత’ను పరిశీలిస్తే ‘హే జిహ్వే జానకీ జానేన్నా/రామ మాధుర్య మండితం/భజ స్వం సతతం ప్రేమ్నాచా ద్వాచా సహితం స్వతం/ జిహ్వే శ్రీరామ సంస్మరణే/ విలంబం కురుషే లాపేకథం/ వృథయానాదితే కించిత్‌/ వినా శ్రీ రామసుందరం’ అంటుంది. కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా, నిద్రపోయినా రామనామ స్మరణలో లీనమైంది వాయుపుత్రుని భక్తి. శ్రీ రామనామ స్మరణమే కేసరి తన జీవన సర్వస్వం గా భావించాడు.

ఏకమాత్ర భక్తి పరతత్వంగా గలది ‘రామ’నా మ శబ్దం. తాసులో సర్వమంత్ర రహస్యాలను ఒకవైపు ఉంచి మరొకవైపు యోగ, ధ్యాన, రామనా మం ఉంచితే అనంతకోటి ఫలితాలు రామనామ స్మరణకే దక్కుతాయి. ఈ విషయం మహాబలుడు నమ్మాడు. ఆచరించమని భక్తులకు మార్గదర్శనం చేశాడు. ‘అనంతకోటి ఫలదో రామమంత్రో జగత్ప తే’ అన్న శ్లోకాన్ని మారుతి త్రికరణశుద్ధిగా నమ్మా డు. అందుకే, తులసీదాసు ‘రామచరిత మానస్‌' లో ‘తువిరి పవనసుత పావన నామ అబనెబరె కసరి రాకేవు రామో’ అని శ్రీరామభజనతో కూడి న హనుమంతుని దీక్షను ఉటంకిస్తాడు.

ఎవరైతే స్నేహపూర్వకంగా రామనామ స్మరణ చేస్తారో, మంగళకరమైన భజన చేస్తారో వారినే నేను రక్షిస్తాను. ‘ప్రయత్నపూరక దాతకు రక్షగా ఉంటానని’ అంటాడు. ‘లౌకిక సమను ప్రాప్తే మాం/స్మరేద్రామసేవకం’ అంటున్నది రామరహస్యో పనిషద్వాక్యం. ‘రామనా మ స్మరణతో హనుమంతుడెలా పులకితుడౌతాడో ఆయన సేవ, భజనతో రామభక్తులు అలానే పునీతులౌతారు. బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, వాక్పటుత్వం, ఆరో గ్యం అనే ఆరు గుణాలను నిత్యచేతనం చేయించడమే హనుమంతుని నామస్మర ణ, రామభక్తి’ అంటున్నది రామాయణం.

శివుని ప్రభావం గల ఆంజనేయుడిని ‘ఏకాదశి రుద్రుని’ రూపంలో పూజించాలని ‘స్కాందపురాణం’ చెబుతున్నది. ‘ఓవై ఏకాదశ రుద్రో హనూమాన్‌ సం మహాకపిః/అవతీర్ణం సహాయార్థం విష్ణోరమిత తేజసః’ అని విశ్లేషిస్తున్నది. ‘శివపురా ణం’ కూడా రామకార్యం కోసమే హనుమంతుడు జన్మించినట్లు పేర్కొన్నది. శివుడు రామనామ ప్రాధాన్యాన్ని, హనుమంతుని ఆవిర్భావాన్ని పార్వతీదేవికి ఒకానొక సందర్భంలో వివరించాడు. ‘మీ భక్తుడైన రావణునిపై మీకే ఎందుకింత కోపం?’ అని అడిగిన పార్వతికి పరమేశ్వరుడు కారణం చెప్తాడు. ‘రావణునికి తొలుత 11 తలలు ఉండేలా తానే వరమిచ్చానని, కానీ అతను తననే అవమానించడం వల్ల దశకంఠుడిగానే మిగలమని శపించానని’ చెప్తాడు. రావణుని అకృత్యాలు రూపుమాపేందుకు రామావతారంలో విష్ణుమూర్తి కి సహాయంగా తానే పుడతానని కూడా శివుడు పార్వతికి వివరిస్తాడు. అలా పుంజికస్థల, కేసరి దంపతులకు రుద్రాంశగా, వాయుదేవుని వరంగా ఆంజనేయుడు జన్మిస్తాడు. నాటినుంచి శైవ, వైష్ణవ ఉభయ మతాలకు ఆరాధ్యుడిగా, అద్వైతానికి ప్రతినిధి అయినాడు. ఓ దశలో రావణాసురుడు సైతం ఆంజనేయుని రామనామ భజనకు తనువు, మన సు పులకితమై పరవశించిపోయాడు. అవసాన సమయంలో రామునికి వందనం చేశాడు కూడా. రామభక్తిని త్రికరణశుద్ధిగా ఆచరించిన ఘనత హనుమంతునిదే.

రామనామ భక్తికి నిలువెత్తు విగ్రహం హనుమంతుడు. ఆంజనేయుని రామభక్తికి పులకించి గో స్వామి తులసీదాసు నలభై ‘చౌపాయీ’లలో ‘హనుమాన్‌ చాలీసా’ రాసి ఆ చిరంజీవి భక్తికి శాశ్వత త్వం కలిగించాడు. చైత్రశుక్ల పూర్ణిమ మారుతి దిగ్విజయ దినం. కార్తీక శుక్ల చతుర్దశి, వైశాఖ బహుళదశమి ఒక్కో ప్రాంతంలో హనుమజ్జయంతిని ఉత్సవంగా, జన్మదినంగా జరుపుకోవడం భారతీయ సంస్కృతిలో గొప్ప ఆచారంగా వస్తున్న ది. రామనామ భక్తిలో భక్తుడిగా, శిష్యుడిగా, దాసునిగా మారుతి అత్యంత ఘనంగా పూజలందుకుంటున్నాడు.


logo