బుధవారం 03 జూన్ 2020
Devotional - Apr 07, 2020 , 00:39:53

ఏది బ్రహ్మం?

ఏది బ్రహ్మం?

వరుణుడు అనే మహర్షి కుమారుడు భృగువు. అత ను ఒకనాడు సూర్యోదయ కాలానికల్లా సంధ్యాదికాలు నిర్వహించేందుకు నదీతీరానికి చేరాడు. నీటిలో ప్రతిబింబిస్తున్న ఉషా కిరణాలు, తీరం వెంట మంచుతో కప్పబడిన పచ్చికబయళ్ళపై సూర్యకిరణ ప్రసారంతో వివిధ రంగులను ప్రతిఫలిస్తున్న దృశ్యం.. ఇలా అక్కడి ప్రాకృతిక సౌందర్యమంతా అతని మనసును పరవశింపజేసింది. ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న భృగువు మనసులో చిన్న సందేహం పొడసూపింది. ‘కండ్లకు కనిపించే ఈ దృశ్య సౌందర్యం శాశ్వతమా? గురువులు బోధిస్తున్న ‘బ్రహ్మం’ ఈ దృశ్యమాన సౌందర్యమా లేక దీనికి భిన్నమైందా?’ ఆలోచించాడు. మనసులో ఎన్నె న్నో భావనలు. అవేవీ తన జిజ్ఞాసకు తగిన జవాబు ఇవ్వలేకపోయాయి. వెంటనే తండ్రి/ గురువు వద్దకు వెళ్ళి, ‘బ్రహ్మం అంటే ఏమిటి? దాని స్వరూప స్వభావాలు ఎలాంటివి? దయచేసి వివరించమని’ వినయంగా ప్రశ్నించాడు. 

తండ్రి సంతోషించాడు. తాను ‘బ్రహ్మం’ అంటే ఏమిటో చెప్పగలడు. కానీ, తాను చెప్పడం వల్ల అతనిలో తానుగా తెలుసుకోవాలనే జిజ్ఞాస తగ్గిపోతుంది. అతనిలో ‘సహజబుద్ధి’ వికసించాలి. వికసించిన లేదా తెరువబడిన మనసులో వివేకం పెరుగాలి. దేహం, ఆత్మ మెదలై న వాటిలోని భేదగతమైన జ్ఞానం అనుభవపూర్వకంగా అవగతం కావా లి. అభివృద్ధి ఎప్పుడూ తన కుతానుగా సాధించవలసిందే. అప్పుడు అసలు సామర్థ్యం తెలుసుకొని, బుద్ధి వికాసానికి కావలసి న దిశలో శిక్షణ ఇవ్వడం వల్ల వ్యక్తిలో పరిణతి పెరుగుతుంది. అది సాధికారికమైన, ఆత్మవిశ్వాసం తో కూడిన, అభ్యుదయ కారకమైన, శాశ్వతమైన విజయాన్ని అతనికి బహూకరిస్తుంది.

అలా ఒక్కొక్క విద్యార్థి దీక్షాదక్షతలను పరీక్షిం చి, ఎవరికి ఏ విషయంపై ఆసక్తిగలదో పరిశీలించి ఆయా అంశాలపై శిక్షణ ఇవ్వడం వల్ల భౌతిక జీవ నరీతిని, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అర్థం చేసుకున్న విద్యార్థులు సమాజంలో ఉత్తమపౌరులుగా ఎదుగుతారు. వరుణుడు తనకు తెలిసిన ఆనందమే బ్రహ్మమనే జ్ఞానాన్ని తన కుమారుడైన భృగువుకు ముందుగానే చెప్పవచ్చు. కానీ, చెప్పలేదు. ఇక్కడ రక్త సం బంధానికన్నా ‘అర్హత’ ప్రధానమైన అంశం. తెలుసుకోవాలనుకునే వారి అర్హత ఎలాంటిదో, పట్టుదల ఎలాంటిదో, స్ఫూర్తి ఎంతటిదో పరీక్షించాలనుకోవడం ముఖ్యం.

అందుకే, ముందుగా ‘అన్నం బ్రహ్మం. దానిని తపస్సు ద్వారా తెలుసుకో’ అన్నాడు. భృగువు తప స్సు చేశాడు. అంటే, దానిపై సుదీర్ఘంగా విచారించాడు. అన్ని కోణాల్లో దాని పరిమితులను పరిశీలించాడు. అప్పుడది కాదని నిరూపించుకున్నాడు. మళ్లీ తండ్రి వద్దకు వెళ్లి అడిగాడు. ఈ సారి తండ్రి ‘ప్రాణం’ అన్నాడు. భృగువు తపించి, అదీ సమ గ్రం కాదని నిరూపించుకున్నాడు. తదుపరి ‘మన స్సు’ అన్నాడు. ‘అదీ కాదని’ తెలుసుకున్నాడు భృగువు. ‘విజ్ఞానం’ అన్నాడు తండ్రి. కొద్దికాలం తపించి ‘అదీ సమగ్రమైంది కాదని’ తెలుసుకొన్నాడు భృగువు.

గురువు శిష్యుని అర్హతను పరీక్షించ డం అయిపోయింది. అతని పట్టుదల, ఓర్పు, సహనం, శ్రమించే తత్వం, విషయంపై ఆసక్తి గమనించి సంతృప్తి చెం దాడు. చివరగా, ‘ఆనందమే బ్రహ్మం’ అని ఉపదేశించాడు. దానిని తపించి అవగాహన చేసుకొమ్మన్నాడు. భృగువు తపించాడు. అందులోని సారాన్ని గ్రహించి ‘అదే సాధికారికమైన, సమగ్రమైన తాత్త్విక రహస్యం’ అని గ్రహించా డు. దానినే ఉపాసించాడు, తరించాడు. ఈ కథ వల్ల తండ్రి లేదా గురువులో ఉండవలసిన లక్షణాన్ని, శిష్యునిలో కావాల్సిన జిజ్ఞాసను సూత్రీకరించి ప్రపంచానికి అందించింది ‘తైత్తరీయోపనిషత్తు’.


logo