శనివారం 06 జూన్ 2020
Devotional - Mar 31, 2020 , 22:26:12

జీవిత పరమార్థం

జీవిత పరమార్థం


మానవుడి జీవన గమనాన్ని అవసరాలతో బట్టి గమనిస్తే మనిషి జ్ఞానం చాలా పరిమితమైంది. లోపభూయిష్టమైంది. దేవుడిచ్చిన మేధ అపార మైందైనా విపరీత, విపత్కర పరిస్థితులను ఎదుర్కొ నే విషయంలో మానవుడి సామర్థ్యం అతి స్వల్ప మైంది. ఇంతటి సూక్ష్మమైన ఈ జీవితంలో కూడా. మానవుడి ఆశ, కోరిక అనంతమైంది. చిన్ని విలం బాన్ని, వైఫల్యాన్ని కూడా భరించలేని ఒక వింత ప్రాణి మానవుడు. అందుకే తనకు పూర్తిగా అర్థం కాని విషయాలను కూడా గొప్పగా సాధించాలని ప్రయత్నిస్తాడు. చాలాసార్లు ఘోర పరాజయాన్ని కూడా పొందుతాడు. 

అసలు పరిస్థితి అర్థమయ్యే లోపే చాలా ఆలస్యం జరిగిపోతుంది. పరిస్థితి తన చేయిదాటి పోతుంది. ఫలితాన్ని తప్పించుకోవడాని కి ఎన్నో ఉపాయాలు ఆలోచించినా అవి ఎంత దూరమో, అనుభవించడం ఎంత కష్ట మో తెలుసుకునే లోపే జరుగాల్సిన ఆల స్యం జరిగిపోతుంది. జరుగాల్సిన నష్ట మూ జరిగిపోతుంది. అప్పుడు తీరిగ్గా కూర్చొని బాధపడటానికి కూడా మనిషి గా అవకాశాన్ని కోల్పోతాడు. అప్పుడు జ్ఞానోదయం జరుగుతుంది. తన బాధ్యతల్ని తాను నిర్వర్తించలేద న్న ఆలోచన కలచివేస్తుంది. ఏ సంఘ నియమాల నూ పాటించలేదన్న నిజం కాల్చివేస్తుంది. ఎవరి అంచనాలనూ, కనీసం తన సొంత అంచనాల్ని కూడా తాను అందుకోలేదన్న తపన, ఎవరి ఆశలూ తీర్చలేదన్న తత్త్వం బోధబడుతుంది.

అప్పుడు మానవుడు తనను తాను, లోతుగా చూసుకుంటే, తన జీవన గమనాన్ని అవలోకనం చేసుకుంటే వచ్చిన నిర్వేదంలోని భావం ఇప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్టు, అప్పుడే జీవితపు చివరి మజి లీ దగ్గర పడినట్టు అనిపించడం. ఈ స్థితిలో తాను ఎవరిని తలుచుకుంటాడు? ఎవరు తన సమస్యకు సమాధానం చెబుతారు? అప్పుడు కేవలం తన దగ్గ రున్న ఒకే ఒక్క ఉపాయం ఏది? అదే  అన్ని లోకా లను రక్షించే ఒకే ఒక్క శక్తి. సర్వాంతర్యామిగా చెప్ప బడే ఒక అదృశ్యమైన స్వరూపం. నేనున్నానని కొం డంత ప్రశాంతతను కల్పించి అండగా నిలిచే ఆత్మ ైస్థెర్యం. అదే జీవన సర్వస్వమవుతుంది.

ఒక ఆశక్తుడైన మానవుడిగా ఆ శక్తికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవడం, నీవే దక్క వేరొక దిక్కు లేదన్న పరిపూర్ణ భావాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. ఆ శక్తే భగవంతుడు. ప్రాణుల బాధలన్నీ తీర్చే బాధ్యత తీసుకున్న పరమ శక్తి. తన పంచాంగాల తో సర్వ ప్రాణికోటిని రక్షించే మహాశక్తి. అప్పుడు ఈ బ్రహ్మాండంలోని అతి సూక్ష్మ ప్రాణివైన మానవుడా! నువు ఆ భగవం తుడికి అత్యంత ప్రీతిపాత్రుడవవుతావు. ఎంతో దయగల ఆ సౌందర్యవంతుడు ఈ లోకంలోని అన్ని కష్టాల నుంచి మనల్ని మానసికంగా దూరం చేసి ఆనందపు పారవశ్యాన్ని పొందేట్టు చేస్తాడు. మనిషిని ఈ ఐహిక బంధాల శృంఖలాల నుంచి విముక్తున్ని చేస్తాడు. అంతం లేని అవరోధాల బాధ లను పటాపంచలు చేస్తాడు. తనలో ఐక్యం చేసుకుంటాడు. తన ఆనందాన్ని మనదిగా చేస్తాడు.

మనిషితోపాటే తనుకూడా ఒక పసిబాలుడై కేరింతలు కొడుతూ మనల్ని తన గాఢ పరిష్వం గంలో పరిపూర్ణంగా పరవశుల్ని చేస్తాడు. సర్వసం గపరిత్యాగిగా మార్చి తనలో మమేకమయ్యేట్టు చేస్తాడు. సంపూర్ణ అనుభవాన్ని, ఆనందాన్ని పొందెడు సౌభాగ్యాన్ని పంచుతాడు. ఆ స్థితియే భక్తిలో అత్యున్నత స్థాయిగా చెప్పబడే స్థితి. అదే శరణాగతి. నీవు దక్క వేరే లోకం లేదనే తాదాత్మ్య స్థితి. అక్కడ బాధల వల్ల, కష్టాల వల్ల వచ్చే కన్నీళ్లు ఉండవు. మనుషుల వల్ల, మనసుల వల్ల తగి లే గాయాలుండవు. ఆశల వల్ల, ఆశయాల వల్ల జరిగే కుట్రలు, కుతంత్రాలకు స్థానం ఉండదు. అదొక నిర్వికారమైన, ఏమీ లేకున్నా అన్నీ ఉన్నటువంటి ఆనందం, ఏమీ అవసరం లేని అలౌకిక స్థితి. సర్వం బ్రహ్మమయమన్న గొప్ప అనుభూతి. ఇదే భగవద్గీత శ్లోక సారం.

మనిషికి శరణాగతి జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం లాంటి అన్ని సాధనలకు ప్రత్యామ్నాయం. మానవధర్మాలు పాటించలేనప్పుడు మనిషి మనుగడ శరణాగ తిలోనే. అదే మనమనే స్వర్గం. అదే లేనప్పుడు మనిషికి కలిగే బాధలే నరకం. ప్రాణుల్ని అన్ని ఐహి క పాపాల నుంచి విముక్తుణ్ని చేసి మోక్షసాధనకు భగవద్గీత చూపిన ఉత్తమమైన మార్గం. అదే కైవల్య పథం.


logo