బుధవారం 03 జూన్ 2020
Devotional - Mar 30, 2020 , 22:42:17

ప్రణతోస్మి దివాకరమ్‌

ప్రణతోస్మి దివాకరమ్‌

సూర్యుడు లేకుంటే ఈ జగత్తు లేదు. ఈ జగత్తు ను దర్శిస్తూ అందులో జీవిస్తున్న మనమూ ఉండ ము. సూర్యకిరణాలు వేడిని కలిగి ఉంటవి. తాపాన్ని కలిగిస్తవి. కనుక, సూర్యునికి ‘తపనుడు’ అని పేరు. చంద్రకిరణాలు చల్లగా వుంటవి. ఆహ్లాదకరాలుగా ఉంటవి. కానీ, ప్రాణశక్తి మాత్రం సూర్యరశ్మిలోనే ఉంటుంది. అందువల్లనే సూర్యుడు ప్రజాపతిగా కీర్తనలు పొందుతున్నాడు.

ఆదిత్యునికి సూర (శూర), సూర్య అని రెండు పేర్లున్నాయి. ‘సంతి చంతీతి సూర: సృగతౌ’. సంచరించువాడు. గగనతనంలో నిలకడగా వుండక సంచరిస్తాడు. కనుక, అతడు సూర్యుడు. ‘సువతి ప్రేరయతి వ్యాపే రిష్వితి సూర్య:’ వ్యాపారాలలో ప్రేరేపించే వాడు సూర్యుడు. వ్యాపారమంటే వస్తు వినిమయ లావాదేవీలు మాత్రమే కాదు. ఒక ప్రాణి జీవించడానికి, తన ప్రాణాన్ని నిలుపుకోవడానికి నిర్వర్తించే క్రియలన్నింటినీ కలిపి జీవన వ్యాపారమం టాం. చరాచర సృష్టిలోని జీవకోటి సమస్తమూ తన మనుగడను సాగించేందుకు తోడ్పడేవాడు సూర్యుడన్నమాట.

సూర్యునికి ‘మిహిరుడు’ అని మరొక పేరుంది. ‘మేహతి మేఘరూపీ విశ్వం సించతీతి మిహిర:, మిహసేచనే’. తాను మేఘరూపియై ప్రపంచాన్ని తడిపెడు వాడు. సూర్యుని కారణంగా మేఘాలు ఏర్పడుతున్నాయి. మేఘాలు వర్ష కారకాలు. వర్షాల వల్ల వృక్ష సంతతి. వృక్ష సంతతి మళ్లీ రెండు రకా లు. ఒకటి వనస్పతులు, రెండు ఓషధులు. వనస్పతులు జంతుజాలం ఆకలిని తీరుస్తే, ఓషధులు ఆరోగ్యాన్ని కాపాడుతవి. ప్రకృతి పోషిస్తున్న కారణంగా జంతుజాలం పుష్టిగా ఉన్నది. ఈ పుష్టికి మూల కార ణం సూర్యరశ్మి. అందువల్ల సూర్యునికి ‘పూషుడ’ని పేరు. ‘పుష్ణాతీతి పూషా. పుష పుష్టౌ’. పోషించేవాడు.

‘భాసం కరోతీతి భాస్కర:’ కాంతిని కలిగించే వాని పేరు భాస్కరుడు. చీకట్లు తొలిగిపోతే వెలుగు వస్తుంది. వెలుగు తొలిగిపోతే చీకటి వస్తుంది. చీకటిని వెలుగు తొలిగిస్తున్నదా, వెలుగును చీకటి తొలిగిస్తున్నదా అని ఆలోచించినప్పు డు వెలుగే చీకట్లను తొలిగిస్తున్నదని సమాధానం వస్తుంది. కశ్యప ప్రజాపతి సంబంధీకుడు (కుమారు డు) కనుక సూర్యుడు కాశ్యపేయుడు. ‘జపాకుసుమం’ అంటే ఎర్ర మందారం. జపాకుసుమాలు ఇప్పుడు అనేక వర్ణాలలో వస్తున్నవి. కానీ, తొలి దాసాని పువ్వు రంగు ఎరుపు మాత్రమే.

జపాకుసుమ వర్ణంతో సమానమై న, అద్భుతమైన వెలుగులను విరజి మ్మే సూర్యుడు చీకట్లకు శత్రువు. సర్వపాపాలను నశింపజేయగల శక్తి గలిగివున్నవాడు. జీవకోటి పగ టి వ్యాపార నిర్వహణకు తోడ్పడేవాడు కనుక, అత డు దివాకరుడు. ‘దివా అహని ప్రాణి నశ్చేష్టా వతః కరోతీతి దివాకర:’ అని ‘అమరకోశం’ చెబుతున్నది. అటువంటి దివాకరునికి ప్రణామాలు అర్పిస్తూ ప్రార్థిద్దాం.

‘జపాకుసుమం సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం

తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం’.


logo