శనివారం 30 మే 2020
Devotional - Mar 21, 2020 , 22:46:15

ఉగాది పచ్చడి చేద్దామా!

ఉగాది పచ్చడి చేద్దామా!

ఉగాది పండుగ నాడు దేవతార్చన చేసి షడ్రుచుల పచ్చడిని ప్రసాదం (తీర్థం)గా నైవేద్యం సమర్పించడం ఆచారం. ఆరు రుచుల ఉగాది పచ్చడిని ఎలా తయారుచేయాలో శాస్ర్తోక్తంగా వేదపండితులు చెప్పారు. 

ఆ ఆరు రుచులలో తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు వున్నాయి. తొలుత వేపపువ్వును నీటిలో నానబెట్టాలి. అందులో కాసింత కొత్త బెల్లం వేయాలి. బెల్లం నిల్వదైనా వాడవచ్చు. అందులోనే కొంత చింతపండు వేసి, చిక్కని ద్రవం వలె తయారుచేయాలి. దీనిలో కొంత ఆవు నెయ్యి కలపాలి. మామిడికాయ (పిందెలు) ముక్కలను ఇందులో కలుపుకోవాలి. చిటికెడంత కారం, ఉప్పులను చేర్చాలి. ఇంకా వీలైతే, కొన్ని చెరుకుముక్కలు కూడా కలుపుకోవచ్చు. వేపపువ్వును ముందుగా కాకుండా, ఆఖరున కలుపుకొన్నా సరిపోతుంది. అయితే, ఏది ఎక్కువైనా దాని రుచే ప్రధానమవుతుంది. కనుక, అన్నీ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ఇలా తయారుచేసిన  పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి, తర్వాత ఇంటిల్లిపాదీ స్వీకరించాలి. ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇలా అన్ని రుచుల సమ్మేళనంగా సాగుతుందని చెప్పడానికి దీనినొక ప్రతీకవలె భావిస్తారు.logo