శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Mar 21, 2020 , 22:42:15

భవిష్యద్దర్శనం!

భవిష్యద్దర్శనం!

  ఉగాది పర్వదినం నాడు పంచాంగ శ్రవణం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఏమిటీ పంచాంగం? ఎందుకు అందులోని విశేషాలను వినాలి? వింటే ఏమొస్తుంది? వినకపోతే ఏమవుతుంది? వంటి ప్రశ్నలు ఈతరం వారికి కలగడం సహజం. పంచాంగం అంటేనే వచ్చే ఏడాదిపాటు కాలం తీరుతెన్నులను, ఫలితాంశాలను తెలుసుకోవడం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే అయిదు విభాగాలు పంచాంగంలో ప్రధానం. భారతీయ వైదిక, ఖగోళ, జ్యోతిష శాస్ర్తాల ప్రకారం కాల విభజన అత్యంత లోతైంది. రానున్న సంవత్సరంలో వచ్చే 356 రోజులు (12 నెలలు) ఎలా వుండబోతున్నాయన్నది దీనిద్వారా సమగ్రంగా తెలుస్తుంది. ఋతుపవనాలు, గ్రహ, నక్షత్రాది గమనాలు, వాటి స్థితిగతులను, అవి భూమిమీది ఆయా వ్యక్తుల జీవన విధానాలపై చూపించే ప్రభావాలను సిద్ధాంతులు ముందుగానే గణితశాస్త్రయుక్తంగా లెక్కలు కట్టి, పంచాంగాలలో పొందు పరుస్తారు. వాటిని తెలుసుకోవడం ద్వారా రానున్న ఏడాది కలుగబోయే శుభాశుభాలు క్తుప్లంగా  ముందుగానే తెలిసిపోతాయి. ఆ సంవత్సరంలో కురిసే వర్షాలు, పండే పంటలు, మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు, జంతుజీవుల జననమరణాలు వంటివన్నీ ఇందులో వారు వెల్లడిస్తారు. మన ఆదాయ వ్యయాలు, గౌరవాభిమానాలు, శుభ ముహూర్తాలు వివరిస్తారు. ఫలితంగా తగు జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది.logo