సోమవారం 13 జూలై 2020
Devotional - Feb 13, 2020 , 22:56:27

పూలలో సువాసన ఎలా?

పూలలో సువాసన ఎలా?

ప్రకృతిలోని చాలా పువ్వులు పర్‌ఫ్యూముల వలె సువాసనలను వెదజల్లడానికి వాటిలోని వివిధ రసాయనాల సమ్మేళనాలే కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

రోజాపూలలోని రసాయనాల సమ్మేళనాన్ని ‘సిస్‌రోజ్‌ ఆక్సైడ్‌' (cis-Rose oxide) గా పిలుస్తారు. స్వచ్ఛమైన రోజాల సువాసనకు ‘ఐసోమర్‌ ఆఫ్‌ రోజ్‌ ఆక్సైడ్‌' ( isomers of rose oxide) అని పేరు పెట్టారు. ఇక, పూలగుత్తిలో కార్నేషన్స్‌ (carnations) వాడుతారు. రోజాలకంటే కార్నేషన్స్‌ కొంత తక్కువ గుబాళింపుతో ఉంటాయి. వాసన అన్నది రావడానికి సహజంగానే యుజెనాల్‌ (Eugenol) అనే రసాయనం దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు అంటారు. దానితోపాటు బీటా-కార్యోఫైలిన్‌ (Beta-caryophyllene), బెంజాయిక్‌ యాసిడ్లు (Benzoic acid) కూడా వాసనను వెదజల్లుతాయి. వాయిలెట్స్‌ (violet)నూ పూలగుత్తులలో వాడతారు. రోజాలు, కార్నేషన్స్‌లోకంటే పూలగుత్తులలోనే ఎక్కువగా వాయిలెట్స్‌ వినియోగిస్తారు. వీటిలో అయొనోనెస్‌ (ionones) అనే రసాయనం ఉంటుంది. లిల్లీపూలలో వేరే రసాయన మిశ్రమం ఉంటుంది. జీనెస్‌ (ఇ), బీటా ఓసిమెన్స్‌ (genes (e)-beta ocimene), లినాలుల్‌ (Linalool)ల రసాయనాల కారణంగా లిల్లీపూలకు అంతటి సువాసన వస్తుందని వారంటున్నారు.


రోజూపూలలోని ఎంజైమ్‌ డీఎన్‌ఏను శుభ్రపరచడమూ అంతటి సువాసనకు మరొక కారణమని శాస్త్రవేత్తలు అంటారు. కొన్ని రకాల రోజాలలో ఈ ఎంజైమ్‌ ఉండకపోవచ్చు. దీనితోపాటు రోజాలలో ఆకర్షణీయమైన రంగులు, త్వరగా వాడి పోకుండా ఉండటానికి కూడా కొన్ని ఎంజైములే కారణమని వారంటున్నారు. సాధారణంగా సువాసన ‘పూల సంరక్షణ కోసమే’ అని అంటారు. దీనితోనే ఫలదీకరణ సంకేతాలు వ్యాపిస్తాయి. రకరకాల రసాయనాలు పూలలో లేకపోతే వాటి ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. సువాసనలతో పూలలోని పుప్పొడి రేణువులకు ఫలదీకరణ చెందే సమయం వచ్చినట్లుగా నిర్ధారణవుతుందని శాస్త్రవేత్తలు అన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పూలను నాశనం చేసే కొన్ని రకాల కీటకాలు దగ్గరగా వచ్చినప్పుడు అవి సువాసనకు బదులు చెడువాసనను ఇచ్చే ‘స్టెరాయిడల్‌ ైగ్టెకోసైడ్స్‌' (Steroidal glycosides) ను విడుదల చేస్తాయని కూడా వారంటున్నారు. పూలు తమ రెక్కలలోకూడా సువాసనలు వెదజల్లే రసాయనాలను నిలువ వుంచుకొంటాయి. వేడి వాతావరణంలో ఈ రెక్కల్లోని రసాయనాలు లేదా ద్రవాలు ఆవిరైన కారణంగా సువాసనలు విడుదలవుతాయి. దీంతో కీటకాలు వాటి దరిచేరతాయి.logo