శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jan 12, 2020 , 00:33:47

జ్యోతి స్వరూపుడు లేనిదెక్కడ?

జ్యోతి స్వరూపుడు లేనిదెక్కడ?

మకర సంక్రాంతి వేళ సాయంసంధ్యా సమయంలో కేరళలోని పొన్నంబళమేడు కొండపై ‘మకరజ్యోతి’ దర్శనం ఒక పవ్రిత భావన. ‘దైవం మానవరూపమే కాదు, జ్యోతి స్వరూపుడు’ కూడా అన్న దానికి ఇదొక నిదర్శనం. ఈ జ్యోతి సుదూరాల (శబరిమల సన్నిధానం, పంబ, పులిమేడు వంటి ప్రాంతాలు) నుంచి చూసేవారికి ఆకాశంలో నక్షత్రం వలె వచ్చి పోతూ కనిపిస్తుంది. దీనిని శబరిమల దేవస్థానానికి చెందిన గిరిజన భక్తులే ఆ వేళకు వెలిగిస్తారన్నది నిజమే అయినా అయ్యప్ప భక్తులలో దానిపట్ల దైవిక భావన చెక్కుచెదరలేదు. సూర్యుడు భూమికి ఆవాసమిచ్చిన ఒక స్వత:సిద్ధ నక్షత్రం. మనింట్లో రాత్రిళ్లూ వెలిగించే ఎలక్ట్రిక్‌ బల్బు కృత్రిమం. రెండూ కాంతినిస్తాయన్నది నిజం. దేని వెలుగు ప్రత్యేకత దానిదే. మానవాళికి, ప్రకృతికి మేలు చేయడమే వాటిలోని పరమార్థం. దానినే దైవత్వంగా భావిస్తాం. అందుకే, ఏడాదికి ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొందాం. కాకపోతే, ఆ రోజు భక్తులు క్రిక్కిరిసే చోట విధిగా క్రమశిక్షణ పాటిస్తే సరి.

తాజావార్తలు


logo