శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jan 12, 2020 , 00:25:33

అందుకే ఆ ప్రాయశ్చిత్తం!

అందుకే ఆ ప్రాయశ్చిత్తం!

భవత్యో యది మే దాస్య: మయోక్తం వా కరిష్యథ
అత్రాగత్య స్వవాసాంసి ప్రతీచ్ఛంతు శుచిస్మితా: ॥
- శ్రీమద్భాగవతం, కాత్యాయని వ్రతం (10-22-17)

గోపకన్యలంతా పొద్దున్నే లేచి, చలికి భయపడకుండా కృష్ణగానం చేస్తూ కాళిందీ నదికి చేరతారు. వస్ర్తాలను విప్పి, వాటిని ఒడ్డుపైన వదిలేసి, నదిలోకి వివస్త్రలుగా దిగి, స్నానాలు ప్రారంభించారు. ఇదే చాలా పొరపాటు. ఎవరైనా అంత బహిరంగ ప్రదేశంలో అలా చేస్తారా? కానీ, వారిలోని శ్రీకృష్ణ ప్రేమ అంత గాఢమైంది. అప్పుడేమైంది? శ్రీకృష్ణుడు వారి వస్ర్తాలను అపహరించి కడిమి చెట్టుమీదికి చేరాడు. పరమాత్మ ఎందుకీ ‘చిలిపి’ పని చేశాడో ‘శ్రీమద్భాగవతం’లోనే ఉన్నది. ప్రత్యేకించి ‘వ్రతదీక్ష (కాత్యాయని)లో ఉన్నవారు అలా నదిలో వివస్త్రలుగా స్నానం చేయరాదని’ శ్రీకృష్ణుడు గోపికలకు వస్ర్తాలిచ్చేసి ఉద్బోధిస్తాడు. ఈ విషయాన్ని అమాయకులైన ఆ కన్నెపిల్లలకు తెలియజెప్పి, వారికి ప్రాయశ్చిత్తం కలిగిస్తాడు.


logo