శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jan 12, 2020 , 00:19:43

కొత్త కాంతికి స్వాగతం!

కొత్త కాంతికి స్వాగతం!

ఏటా వచ్చేదే అయినా ప్రతీ సంక్రాంతి తనదైన కొత్త కాంతిని తెస్తుంది. రోజూ వచ్చే సూర్యోదయమే అనుకొంటూ నిస్తేజపడితే ముందుకు కదల్లేం. పోయిన కాంతి కణాలు మళ్లీ రావు. వచ్చేవన్నీ ఎప్పటికప్పుడు కొత్త కాంతి కణాలే. కనుక, సరికొత్త స్ఫూర్తితో ముందడుగు వేద్దాం. మనదైన స్థానికతలు, భారతీయతకు పెద్దపీట వేద్దాం. ప్రాచీన వేదసంస్కృతిలోని జీవన విలువలను గుర్తిద్దాం. వాటిలోని మానవీయ కోణాలను మనం ఆచరణలో పెడుతూ, రాబోయే తరాలకోసం అందిద్దాం. రంగురంగుల ముగ్గులు, ఆకాశంలో ఎగిరే గాలిపటాలు, పిండివంటల కమ్మదనం, మిఠాయిల మధురిమ, గంగిరెద్దుల గలగలలతో సహా పాడిపంటల పచ్చదనాన్ని తలకెత్తుకొందాం. ప్రకృతి, పర్యావరణ, జీవావరణాలతోసహా తోటి మానవాళిపట్ల మమతానురాగాల పూలు చల్లుదాం. అప్పుడే నిజమైన సంక్రాంతి సౌరభం కదా!

తాజావార్తలు


logo